This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
జైగణేశ్
 
35
 
చైతన్య తపోవన్
 
శ్రీ శివకేశవపీఠం-సంస్థాపక పీఠాధీశ్వరి
పూజ్యశ్రీ శ్రీ శ్రీ శ్రీ మాతా శివానంద సరస్వతీ వారు
డో.నం.14-271-1.ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర. శివకేశవనగర్. తాడేపల్లి-522502. (ఆం.ప్ర)
 
జైరాధేశ్యామ్
 
8.12-5-23.
 
ఓం శ్రీగురుభ్యోనమః
 
బ్రహ్మశ్రీ అవతారశర్మగారికి హృదయపూర్వక మంగళాశాసనములు.
 
"అందరికీ సంధ్యావందనం" అనే శ్రీపాదుకా సంధ్యాకల్పం రచన, ప్రమాణసేకరణ
యావత్ ప్రపంచానికి చాలా మేలు చేస్తుంది. శుభాలను చేకూరుస్తుంది. ఆరోగ్యాన్ని,
ఐశ్వర్నాన్ని, శాశ్వతానందాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రీగాయత్రీ మహామంత్ర తత్త్వమును
జాతి,మత,వర్ణ,లింగ వివక్షలేకుండా, అందరూ సులభంగా జపించేటంతగ దాని వైశిష్ట్యాన్ని
తత్ప్రభావాన్ని, ఆతల్లి కృపతో మనకందించారు శ్రీపాదుక అవతారశర్మగారు. ఇదివరకే
శివానందలహరి, శివఃకేవలో హమ్, మొదలగు ఎన్నో రచనలుచేసి భగవతికి సమర్పించి
ప్రసన్నురాలిని చేసుకున్న భాగవతోత్తములు. సమాజసర్వేశ్వరునికి స్వీయరచలతో
సేవలందిస్తున్న సంతృప్తి స్వరూపులు.
 
'ప్రారబ్ధం శరీరానికేగాని నాకు కాదు. చిదానందస్వరూపమే నేను. 'శివోహం శివో
హం శివః కేవలో హమ్' అనే ఆనందానుభూతితో సర్వేంద్రియాలను సాధనాలుగా స్వాధీనం
చేసుకున్న సిద్ధపురుషులు మన శ్రీపాదుక అవతారశర్మగారు మనందరిపాలిట అవతారపురుషులే!
అంతటి మహానుభావునికి కృతజ్ఞతతో ఎమేమి ఎంతగా సమర్పించినను తక్కువే!
 
అందుకే ప్రతిరోజూ మూడు సంధ్యలలో గాయత్రీస్వరూపములైన, సరస్వతీ సావిత్రీ,
వైష్ణవీ మాతలకు సంధ్యావందనమును సమర్పించి, వీరికి ఆచరణపూర్వక
కృతజ్ఞతాభివందనములను సమర్పిద్దాము.
 
నారాయణస్మరణపూర్వకముగా–
 
vi
 
సం. మాతా శివానందసరస్వతి.