This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
కాకుండా, తమనుతాము నాశనం చేసుకోకుండా ఉద్ధరించుకోవాలి. కనుక
అందరికీ కూడా పాపనివృత్తికి, పుణ్యప్రాప్తికీ 'సంధ్యావందనం' ఉత్తమ సాధనమై
 
ఉంది.
 
V
 
వేదం-'అహరహస్సంధ్యాముపాసీత' అని చెప్పింది. కనుక అందరూ
కాశీవాసులైన అవతారశర్మగారు ఈ పుస్తకంలో చెప్పినట్లుగా సంధ్యాసమయంలో
సంధ్యకు వందనం చేసి తరించాలి. సంధ్యావందనంవల్ల ఎప్పటిపాపం అప్పుడే
నశించిపోతుంది. పుణ్యమూ వృద్ధిచెందుతుంది. భగవదనుగ్రహమూ
 
కలుగుతుంది.
 
ఇదే లోకకల్యాణకాంక్షాతత్పరులైన శ్రీ గణపతిసచ్చిదానంద
స్వామీజీవారు, శ్రీదత్తవిజయానందతీర్థస్వామివార్ల ఉద్దేశ్యము. రచయిత
అయిన శ్రీఅవతారశర్మగారి ఉద్దేశ్యంకూడ. కనుకనే ప్రతిఒక్కరూ ఈపుస్తకాన్ని
అందుకొని ధర్మంలో నిలబడండి. ధర్మాన్ని ఆచరిస్తూ, అందరిచేత ఆచరింప
చెయ్యండి. లోకంయొక్క వెన్నుతట్టి, కన్ను తెరిపిస్తున్న ఉభయగురుదేవులకు,
శ్రీపాదుక అవతారశర్మగారికి నమోవాకాలు అర్పిస్తున్నాను. పూజ్య గురుదేవుల
ఆశీస్సులు మీకు ఎల్లవేళల లభించాలని ప్రార్థిస్తున్నాను.
 
జయ గురుదత్త!
 
8.12.05.2023,
 
మైసూరు.
 
రామ్ జీ
అవధూతదత్తపీఠము