This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
చెప్పుకోవాలి. (ఇలా కేశవనామాలను కీర్తించడంవల్ల విష్ణుసహస్రనామ
 
పారాయణఫలం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు).
 
పిమ్మట
 
27
 
'ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః॥
 
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే'- అని భూతోచ్చాటన
 
మంత్రాన్ని చెప్పుకుని-
ఘంటానాదం:– ఘంటను మ్రోగించేటప్పుడు దేవతలను స్వాగతిస్తూ-
'ఆగమార్థం తు దేవానాం గమనార్ధం తు రక్షసామ్।
కుర్యాంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్॥"—అనే
 
శ్లోకం చదవాలి.
 
(గమనిక-'పుండరీకాక్షాయనమః'నుండి 'ఘంటానాదము'వరకుగల
విధానము మూడు సంధ్యావందనములకు సమానముగా చెప్పుకొనవలెను)
 
ప్రాతస్సంధ్యాచమనము-
శ్లో॥మం॥అజ్ఞానాద్విస్మృతేర్రాంత్యా పూర్వరాత్ర్యాం తు యే కృతాః॥
సర్వే పాపాః ప్రణశ్యంతు ప్రాతరాచమనేన తే॥
 
(గతరాత్రి నాచే తెలిసి, తెలియక, లేదా భ్రమప్రమాదములచే చేయబడిన
పాపకర్మలన్నియు ఈ ప్రాతస్సంధ్యాచమన ప్రభావముచే నశించుగాక!) అని
 
త్రాగాలి.)