This page has not been fully proofread.

22
 
అందరికీ సంధ్యావందనం
 
మన దేశానికి పూర్వవైభవం రావాలి.
 
ఏతద్దేశప్రసూతస్య సకాశాదగ్రజన్మనః।
 
స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః॥ (మను2.20)
ఈదేశంలో ఋషిసంతతిలో జనించిన బాలకునినుండి యావత్
భూమండలములోని మానవులు తమకు అవసరమైన (ఆదర్శప్రాయమైన)
చారిత్రిక (శీల)ప్రశిక్షణను పొంది తరించాలి. భారతీయసంతతి సదా జగద్గురు
స్థానములోనుండాలి. అనే మనుధర్మసూత్రాన్ని ధ్రువీకరించవలసిన బాధ్యత
ప్రతి భారతపౌరుడూ స్వీకరించి మనదేశ సంస్కృతీవారసత్వములను
పరరక్షించుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం, కేవలం 15నిముషములలో
ఆచరించడంద్వారా తరింపజేయగల ప్రామాణికమైన రచనగా మీకందిస్తున్న
"అందరికీ సంధ్యావందనము" అనబడే ఈ 'శ్రీపాదుకా సంధ్యాకల్పము'.
ఇది మానవాళి సమస్తము, జాతి, మత, లింగ, వయోభేదాదుల ప్రమేయము
లేకుండా ఆచరించుటకనువుగా ప్రామాణికముగా కూర్చబడినది.
ఈసంధ్యాకల్పములో-త్రిసంధ్యలలో సంధ్యోపాసనవిధి సంక్షేపముగా
ఆచరణయోగ్యముగా ప్రస్తావింపబడినది. విశేషములు తెలిసికొనగోరువారు
ఆప్తులు తత్త్వవిదులునగు విజ్ఞులను సంప్రదించగలరు. పాఠకులు
యథాయోగ్యముగా దీనిననుసరించి తరించగలరు.
 
fact