This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
పిల్లలు నేటికీ మన ఇళ్ళలో ఉన్నారు. కాకుంటే తల్లిదండ్రులు వారిని
ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు. కాని
మనమాపనిని చేయడం లేదు. పైగా మన పాఠ్యాంశములలో కుహనా
సెక్యులరిజం పేరుతో మన ప్రార్థనలను, వాని మాహాత్మ్యములను బోధించడం
మానివేసి వ్యక్తిత్వవికాసమును కలుగజేసే ఆదర్శములను బోధించడానికి
కేటాయించిన సమయాన్ని మన పాఠ్యప్రణాళికల మరియు టైంటేబిల్స్ నుండి
తొలగించేసుకున్నాము. ఇది మన దౌర్భాగ్యం!
 
ఇతర మతస్థులు మన సంప్రదాయాన్ని అవలంబించి, వాటిని తమ పిల్లల
బోధనకార్యక్రమాలుగా అమలుపరుస్తున్నారు. క్రైస్తవులు సూర్యదేవాత్మకమైన
భానువారము(SUN DAY) ను తమ ప్రార్థనాదివసము (PRAYERDAY)గా
స్వీకరించి ఆరోజున ఆబలగోపాలము విధిగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు.
వారు తమ పాఠశాలలలో ప్రార్థనా సమయమును కేటాయించడమే కాకుండా
దేవుడు తమ ప్రార్థనలను తప్పకుండా వింటాడని బోర్డులు కూడా వ్రాసి
బోధిస్తున్నారు. ముస్లిములు నియమంతప్పకుండా సంధ్యాసమయంలో
వందనం(నమాజు)చేస్తారు. దయచేసి ఈ చిత్రాలని చిత్తగించండి-
20
 
PRAYER
TIME
 
ER
 
CHANGES
 
THINGS
 
A TIME TO
 
Lord.
PRAY
Hear Our **