This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
తాముగా తరించువారు ఋషులు. తాము సాధించిన ఆత్మోన్నతితో అందరినీ
ఆత్మీయులుగా అంటే, తనవారుగా తరింపదగినవారుగా తలంచి, తాను
సాధించిన ఆత్మశక్తితో అందరనూ తరింపజేయాలనిఅహరహము
పరితపించువారు మహర్షులు. మనం అలాంటి మహర్షులసంతతికి
చెందినవారమని ఇప్పటికీ వారి సగోత్రీకులముగా భావించుకుంటున్నాం.
ఇది మనం సగర్వంగా భావించదగ్గ విషయం.
 
'సర్వే భవంతు సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిద్ దుఃఖమాప్నుయాత్॥
అందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలి. నిత్యము శుభములనే సందర్శిస్తూ
ఉండాలి. దుఃఖములనెవ్వరూ పొందకుందురుగాక! ఇలా అందరూ తరించాలనే
విశ్వకల్యాణకామనతో వారు మనకు మూడుపూటలలో విధిగా
నిర్వర్తించవలసిన మహాశక్తిమంతమైన సంధ్యావిద్యని ఉపదేశించేరు.
దానివల్ల స్వార్థచింతన, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు,
స్వపరభేదాలు అన్నీ నశిస్తాయి. లోకములన్నీ సుఖశాంతులతో మనుగడ
సాగిస్తాయి.
 
19
 
అటువంటి సంధ్యావిద్య లేదా సంధ్యోపాసనను మనవంతు కర్తవ్యంగా
శ్రద్ధాభక్తులతో ఆచరించి, మనము మనసంతతియే కాకుండా
యావత్ప్రపంచము వారి ఆశీస్సులతో తరించేలా ప్రయత్నించడం మన
కర్తవ్యమా? కాదా? ఒక్కసారి విజ్ఞతతో మానవతాదృష్టితో ఆలోచించండి.
ఇది మనకి అసాధ్యమేమీ కాదు. అత్యంత సులభతరమైనది.
నేను గమనించేను. శ్రోత్రియ కుటుంబాలలో పిల్లలు రెండు, మూడేండ్ల
వయస్సులోనే, పంచపాత్ర ఉద్దరిణె లేదా ప్లేటు చెంచా పట్టుకుని
సంధ్యావందనంచేస్తున్న పెద్దలను అనుకరిస్తూ ఉంటారు. ఐదేండ్ల నుండి
పదేండ్ల వయస్సులో ఉపనీతులై సహస్రగాయత్రీ మంత్రానుష్ఠానంచేస్తున్న