This page has not been fully proofread.

18
 
అందరికీ సంధ్యావందనం
 
మహాసంకల్పం!
 
లోకంలో అందరూ మంచివాళ్ళే ఉండాలి. దుర్మార్గులనేవాళ్ళుండకూడదు. ఇది
సాధ్యమా? అంటే సాధ్యమే! మన స్వభావంలో లేదా ఇతరత్ర ఎక్కడైనా చెడు
కనిపించినప్పుడల్లా దానినుండి మనం మరలే ప్రయత్నం చెయ్యాలి. అలాగే
కనిపించిన చెడును మంచిగా మార్చడానికి మనవంతు ప్రయత్నం మనం
చేస్తూ ఉండాలి. విడువకుండా ఈ అభ్యాసాన్ని నిరంతరం చేస్తూనే ఉండాలి.
ఈ ప్రయత్నమే మనం ప్రతీరోజూ మూడు పూటలలో విధిగా చేయవలసిన
సంధ్యోపాసన. దీనిని అందరూ చేసుకోవచ్చు. మనకోసం, మనవారందరికోసం
లోకకల్యాణం కోసం విశ్వశాంతికోసం మనం చేసితీరాలని సంకల్పించాలి.
ఇది మనం చేయాల్సిన మహాసంకల్పం!
 
దీనివల్ల అందరిలో సద్భావన కలుగుతుంది. దానివల్ల మిగిలిన వారి సంగతి
యెలాగున్నా, మనకు మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతచిత్తముకల సజ్జనులున్న
సమాజంలో సుఖసంతోషాలు, సంపత్సమృద్ధులు నెలకొంటాయి. వారు
దుఃఖములను దాటి ఇతరులను దుఃఖములనుండి విముక్తులనుగావించే
ప్రయత్నం చేస్తారు. కాగా-
'దుర్జనః సజ్జనో భూయాత్-సజ్జనః శాంతిమాప్నుయాత్
 
శాంతో ముచ్యేత బంధేభ్యః - ముక్తశ్చాన్యాన్విమోచయేత్॥-అనగా
దుర్మార్గులంతా సన్మార్గులు కావాలి, సజ్జనులకు శాంతి లభించాలి,
శాంతచిత్తులకు శాశ్వతమైన మోక్షము కలగాలి, అలాముక్తిని బడసినవారు
మిగిలినవారినందరిని తరింపచెయ్యాలి. ఇదీ సంధ్యోపాసనయొక్క సందేశం!
అందరికీ సుగతియే! అందుకే సంధ్యావందనం!!
 
మనం మహర్షుల సంతతికి చెందినవాళ్ళం. అంతర్ముఖుడై తనదైన తపశ్శక్తితో
తనలో నిద్రాణమై యున్న ఆత్మశక్తిని ఉత్తేజపరచి ఊర్ధ్వగామియై
విశ్వజనీనములైన సత్యములను సందర్శించి, ఆత్మోన్నతిని సాధించి, తమకు