2023-05-28 17:35:32 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనము
అవధూత దత్త పీఠము
శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము, దత్తనగర్, మైసూరు - 570025
దూరవాణి : 0821 2486486 Email : mail@dattapeetham.com
॥శ్రీగణపతిసచ్చిదానంద సద్గురుభ్యోనమః॥
॥శ్రీదత్తవిజయానందతీర్థ గురుభ్యో నమః॥
iv
Avadhosts Da
తొలిపలుకు
జయ గురుదత్త!
ఉభయ గురుదేవులైన శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీవారు,
శ్రీదత్తవిజయానందతీర్థ స్వామీజీవారు, మీరు పంపిన "అందరికీ
సంధ్యావందనం" పరిశీలించి, అందరికీ ధర్మాన్ని గుర్తుచేసి, అందరినీ
ధర్మాచరణానికై ప్రేరేపిస్తున్నందుకు చాలా సంతోషించేరు. మీకు
ఆశీస్సులందించారు. ఉభయగురువులు ప్రతిరోజూ అందరికి
'సంధ్యావందనము, గాయత్రీమంత్రము' చెయ్యమని చెపుతూ ఉంటారు. అవి
చెయ్యకపోతే ప్రయోజనమే లేదు అని ఘోషిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరమూ
పీఠంలో సామూహిక ఉపనయనాలు చేయించటమేకాక, ఇంకా మిక్కుటంగా
గాయత్రీమంత్రజపాదులను, గాయత్రీ హెూమములను జరిపిస్తున్నారు.
అందరికీ ఇతరవిద్యలను పట్టుకొని త్వరత్వరగా సిద్ధులు సాధించాలని
ఆశ ఉంటుంది. తప్పు లేదు. అయితే విధిగా చెయ్యవలసినది, సకలసిద్ధులను
ఇచ్చేది, నిత్యకర్మ అయిన సంధ్యావిద్యను మాత్రం చులకనగా చూస్తూ
ఉంటారు. అది తప్పు. మహాపాపం. సంధ్యకు వందనం చెయ్యకుండా లభించిన
విద్యలు పరిణామంలో వికటిస్తాయి. జీవితాన్నే పాడుచేస్తాయి. అదే సంధ్యకు
వందనంచేసి ఆయా విద్యలనారాధిస్తే అవి సత్ఫలాలను సద్గతినీ
ప్రసాదిస్తాయి. ఇదీ 'అందరికీ సంధ్యావందనం!.
'భగవంతుడున్నాడు. పరలోకమున్నది. పుణ్యపాపములున్నాయి.
పూర్వజన్మ, పునర్జన్మలున్నాయి' అన్నవాడి ప్రవర్తన లోకోపద్రవం కలిగించదు.
అతడు లోకోపకారి అవుతాడు. నీతిగా ప్రవర్తిస్తాడు. చేతనైనంతవరకు పరులకు
సహాయం చేస్తాడు. మరి 'భగవంతుడు లేడు, ఏమీ లేదు' అని ధర్మవిరుద్ధంగా
నడచుకొనేవాడు లోకోపద్రవకారి అవుతాడు. నీతినియమాలులేక స్వేచ్ఛగా
ప్రవర్తిస్తూ లోకాపకారి అవుతాడు. కాబట్టి ఎవరూకూడ అధోగతి పాలు