This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
ఉదయాదిత్యుని బ్రాహ్మముహూర్తములో ఉదయించిన కారణంగా
బ్రహ్మస్వరూపునిగాను ఆసంధ్యాశక్తిని బ్రాహ్మీశక్తి సరస్వతిగాను,
మధ్యందిన మార్తాండుని రుద్రునిగాను ఆసావిత్రమగు భర్గతేజస్సును
రుద్రాణిగను, సాయంకాలసూర్యుని విష్ణువుగను ఆసౌరశక్తిని వైష్ణవిగను
భావించి ఆయా నామాలను నిర్దేశించేరు. కాగా-సంధ్యోపాసనలో
మూడుసంధ్యలలోను సూర్యునితోపాటుగా ఆయన సహజశక్తిస్వరూపాలనూ
కూడ ఉపాసించి తరించాలనేది పరమార్థంగా గ్రహించాలి.
 
అందరం
 
15
 
బాగుండాలి!-అందరిలోమనముండాలి!!
 
'బ్రహ్మాండం-పిండాండం' అంటే జగత్తు జీవుడు వేర్వేరుగా కనిపిస్తున్నా రెండూ
కర్మసాక్షి అంతర్యామియునైన సూర్యుని యొక్క స్థూల సూక్ష్మ శరీరాలే!
రెండింటికీ కూడా ఆయనే ఆత్మగా - "సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ" అని
కీర్తింపబడినాడు. ఏశరీరంలో యేవిధమైన వికారము లేదా
రుగ్ధత(అనారోగ్యము) సంభవించినా ఆదుకుని, సంరక్షించి అన్నివిధాలుగా
మనలనందరినీ తరింపజేసే భవరోగవైద్యుడు సూర్యుడే. అందుకే
పరమకారుణికులైన మన మహర్షులు సంధ్యాసమయములలో సూర్యోపాసనను
'అహరహస్సంధ్యాముపాసీత' అని నిత్యవిధిగా నిర్దేశించేరు.
 
ఇది మన సనాతన ఋషి సంస్కృతి లేదా వేదసంప్రదాయం
జగద్గురుమహెూపదేశంగా ప్రబోధిస్తున్న కల్యాణసందేశం. ఐదేండ్లప్రాయంలో
ఉపనయనసంస్కారము పొందినది మొదలుకొని ప్రతిరోజూ ముప్పొద్దులలో
లోకకల్యాణము విశ్వశాంతులను కోరుకుంటూ సంధ్యోపాసనచేసి ప్రతి
బాలుడూ ఈ దేశంలో తన విశ్వకల్యాణకామనను 'లోకాస్సమస్తాః సుఖినో
భవంతు! ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః' అని ప్రకటిస్తాడు.
 
సనాతన బ్రాహ్మణకుటుంబాలలో నేటికీ ఆవిధమైన వటువులు కనిపిస్తారు.
మనదైన ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.