2023-05-28 17:35:36 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనం
జీవన్ముక్తి ఆయురారోగ్యైశ్వర్యములతో పాటుగా సూర్యసమ తేజస్సు,
ఓజస్సు, వర్చస్సు, యశస్సు, మహస్సులను కేవలము 24 గంటలలో
దినమునకొక్క గంటకాలమును సంధ్యోపాసనకై వినియోగించిన మాత్రముచే
సిద్ధింపజేసి, మనకు లభించిన దుర్లభమైన మానవజన్మను చరితార్థము
చేసికొనడమే మన కర్తవ్యమని తెలియజేస్తూ, సంధ్యావందనవిధిని అందరికీ
ఆచరించి తరించడానికి వీలుగా, మనదైన ఋషిసంప్రదాయానికి భిన్నముకాని
రీతిలో రూపొందించి, గుర్వంబానుగ్రహలబ్ధమైన కొద్దిపాటి పరిజ్ఞాన
ప్రచోదనలతో యిలా సమర్పిస్తున్నాను.
సంధ్యాసమయం- 'సమ్యక్ ధ్యాయతే అస్యామితి సంధ్యా' అంటే,
ధ్యానమునకు సరియైన సమయమే సంధ్య అని చెప్పుకున్నాం. దక్షస్మృతి
ఆసమయాన్ని-'అహెూరాత్రస్య యస్సంధిః సూర్యనక్షత్రవర్జితః
సా చ సంధ్యా సమాఖ్యాతా మునిభిస్తత్వవాదిభిః॥ సూర్యుడుగాని,
నక్షత్రములుగాని లేనట్టి తేయింబవళ్ల సంధికాలము తత్త్వవేత్తలగు మునులచే
చెప్పబడినదని సాధారణముగా చెప్పి,
'సంధౌ సంధ్యాముపాసీత నాస్తగే నోదితే రవౌ సూర్యోదయానికి
పూర్వం ప్రాతఃసంధ్యను, సూర్యుడస్తమిస్తున్నప్పుడు సాయంసంధ్యను
ఉపాసించాలని వివరించింది.
14
ఇంకా ఉపాస్యమైన ఆసంధ్యాస్వరూపాన్ని-
'గాయత్రీనామ పూర్వాహ్లి సావిత్రీ మధ్యమే దినే
సరస్వతీ చ సాయాహ్నే సైవ సంధ్యా త్రిషు స్మృతా॥'-అంటే,
ఉపాస్యమైన ఆ సంధ్యాస్వరూపము ఉదయము గాయత్రి అనియు,
మధ్యాహ్నమున సావిత్రి యనియు, సాయంకాలమున సరస్వతియనియు
స్మరింపబడుచున్నదనియు పేర్కొనినది. ఇది శాక్తసంప్రదాయాన్ననుసరించి
చెప్పినమాట. వారు ముప్పొద్దులలో సూర్యునియొక్క అనగా సౌరదేవతాకమైన
శక్తిని ఆ విధంగా సంభావించేరని గ్రహించాలి. తత్త్వజ్ఞులైన మరికొందరు