This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
విశ్వకల్యాణం అని మనం అనుభవపూర్వకంగా
 
గ్రహిస్తాం.
 
సంధ్యోపాసననెప్పుడెలాచెయ్యాలి? అనే విషయాన్ని మన
మహర్షులు సూచించిన ప్రకారంగా సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నంచేస్తాను.
'అహరహస్సంధ్యాముపాసీత'- అంటే, మూడు సంధ్యలలో విధిగా
సంధ్యావందనము చేసి తీరాలని భావం. చేస్తే నాకు ఒరిగేదేమిటి? లేకుంటే
పోయేదేమిటి? అనే విషయం తెలుసుకుంటే మనకు మనమే సంధ్యావందనం
చెయ్యాలో అక్కర్లేదో నిర్ణయించుకోవచ్చు.
బ్రహ్మవైవర్తపురాణం ప్రకృతిఖండంలో-
13
 
'యావజ్జీవనపర్యంతం యస్త్రిసంధ్యం కరోతి చ
స చ సూర్యసమో విప్రః తేజసా తపసా సదా॥
తత్పాదపద్మరజసా సద్యః పూతా వసుంధరా।
జీవన్ముక్తః స తేజస్వీ సంధ్యాపూతో హి ద్విజః॥
తీర్థాని చ పవిత్రాణి తస్య స్పర్శనమాత్రతః॥
 
తతః పాపాని యాంత్యేవ వైనతేయాదివోరగాః'-అనగా
బ్రతికియున్నన్నాళ్ళూ ముప్పొద్దులలో సంధ్యావందనము చేసే వాడు తేజస్సుతో
తపస్సుతో సదా సూర్యునితో సమానమైన బ్రాహ్మణుడు అనగా బ్రహ్మతేజస్సుతో
వెలుగొందునని భావము.
 
అతని పాదధూళిసోకిన మరుక్షణమే వసుంధరయగు భూదేవి
పవిత్రురాలవుతుంది.. సంధ్యోపాసనచే పవిత్రుడైన ఆ ద్విజన్ముడు
జీవన్ముక్తుడుగా ప్రకాశిస్తాడు..
 
అతని స్పర్శమాత్రముచే, అనగా నతడు తాకిన మరుక్షణముననే
గంగాది పుణ్యతీర్థములు పవిత్రములౌతాయి. మరియు అతనిని చూచినంతనే
గరుత్మంతుని జూచినవెంటనే పాములు భయముతో పారిపోవునట్లుగా
పాపములన్నియు తొలగిపోవును అని చెప్పబడినది. సంధ్యావందనమింతటి
మహిమాన్వితమైనది!