This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
సూర్యసందర్శనము!!. సంధ్యోపాసనమన్నా సంధ్యావందనమన్నా యిదే!
కావుననే మన మహర్షులు దీనిని నిత్యవిధిగా 'అహరహస్సంధ్యాముపాసీత'
బ్రతికియున్నన్నాళ్ళూ ప్రతిరోజూ సంధ్యావందనము చేసి తీరవలసినదేనని
శాసించి మరీ చెప్పేరు.
 
12
 
సంధ్యావందనపరమార్థం
 
ఇంతవరకు మనం సంధ్యావందనమంటే సరియైన సంధ్యాసమయంలో
అవశ్యము చేయవలసిన సూర్యోపాసన అని చెప్పుకున్నాం. ప్రత్యక్షదైవమైన
సూర్యభగవానుని ఉపాసించడానికిగాని, ధ్యానించడానికిగాని అందరూ
అర్హులేననికూడా చెప్పుకున్నాం. అయితే మరి ఆలస్యం ఎందుకు? ఉపక్రమిస్తే
ఓ పనైపోతుందికదా! అని తొందరపడకూడదు.
 
'జ్ఞాత్వాకర్మాణి కుర్వీత' అంటే, అజ్ఞానం లేదా ఎఱుకతో యేపనినైనా
చెయ్యాలని శాస్త్రం. సంధ్యావందనమంటే సంధ్యామయములలో అంటే
త్రిసంధ్యలలో ప్రత్యక్షదైవముగా కనిపిస్తున్న సూర్యభగవానుని ఉపాసించడమని
చెప్పుకున్నాం. సూర్యుణ్ణిగురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఉపాసనను గురించి
భగవద్గీతాభాష్యంలో శ్రీశంకరులు-'ఉపాసనం నామ యథాశాస్త్రముపాస్యస్య
అర్థన్య విషయీకరణేన సామీప్యమువగమ్య తైలధారావత్
సమానప్రత్యయప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం తదుపాసనమాచక్షతే-
(గీతాభాష్యం2/3) - శాస్త్రోక్తవిధానములో ఉపాసింపదగిన
విషయమును(దైవమును) ధ్యానమార్గములో సమీపించి అవిచ్ఛిన్నతైలధారవలె
నిరంతరాయముగా యథాశక్తి చాలాసేపు ధ్యానిస్తూ ఉండడము ఉపాసనమని
వ్యాఖ్యానిస్తారు. ఈ స్థితికి చేరుకోడానికి మనం ప్రతీరోజూ శ్రద్ధాభక్తులతో
చేయవలసిన ప్రయత్నమే సంధ్యావందనము. మనసుండాలేగాని అదేమంత
కష్టతరమైన పనేమీ కాదు. ఉదయం మధ్యాహ్నం సాయంకాలములలో
15నిముషములపాటు అంటే, 24గంటలలో సుమారు ఒక గంట సమయాన్ని
వెచ్చిస్తేచాలు, దీనివలన కలిగే మహాఫలితం- అదే మనశ్శాంతి, మరియు