This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
ఈ నమస్కారవిధికే పారిభాషికంగా అంటే టెక్నికల్గా 'సంధ్యావందనము'
లేదా 'సంధ్యోపాసన' అని పేరు. అందరం సుఖసంతోషాలతో సర్వవిధములైన
సంపత్సమృద్దులననుభవిస్తూ హాయిగా జీవించాలని కోరుకుంటాం.
మనకావిధమైన అందమైన జీవితాన్నందిచ్చి, చివరగా మరణించే
సమయంలో కూడా తనలోనికి చేర్చుకుని శాశ్వతమైన
సాయుజ్యముక్తిననుగ్రహించే ప్రత్యక్షదైవము సూర్యభగవానుడు!
తననర్చించినా అర్చింపకపోయినా, అందరికీ సమానంగా వెలుగును,
చైతన్యమును, స్ఫూర్తినీ, ఆరోగ్యమును, అన్నోదకసమృద్ధిని నిరంతరాయంగా
కలుగజేస్తూ జీవులనందరను సంరక్షిస్తున్న కరుణాసముద్రుడు సూర్యుడు!
ఆయన రోజూ
ఉషఃకాలంలో ఉదయించి, అరుణకాంతితో
బాలభానుడుగా,మధ్యాహ్నసమయంలో ప్రచండమార్తాండుడుగా,
సాయంకాలములో మరల అరుణకాంతితో దర్శనమిస్తూ అస్తమిస్తాడు. ఇలా
మనం మేల్కొని దైనందిన జీవవ్యాపారాలను నిర్వర్తిస్తున్నంతసేపూ మనకు
చేదోడుగానుండి మనలను సంరక్షిస్తూన్న ఆప్తమిత్రుడు ఆదిత్య భగవానుడు!
అందుకే అతని ద్వాదశనామాలలో మిత్రుడు అనే నామాన్నే ముందుగా
కీర్తిస్తున్నాం. 'సూర్య ఆత్మా జగతః'- అని శ్రుతి బహిరంతరప్రపంచములను
నడిపించే ఆత్మస్వరూపుడుగా కీర్తించింది.
 
11
 
సూర్యసందర్శనం!
 
ముప్పొద్దులలో విశాలవిశ్వంలో వినీలాకాశంలో సంచరిస్తున్నట్లుగానే,
సంధ్యాశబ్దాన్ని ధ్యానమునకనువైనసమయమనే అర్థములో సంభావిస్తే గనుక
ఆంతరమైన ఆ భావనాప్రపంచములో దహరాకాశము, అంటే
హృదయాకాశంలో చిద్భానుడుగా, జ్ఞానభాస్కరుడుగా దర్శనమిచ్చి,
ఆయురారోగ్యైశ్వర్యములతో పాటుగా, జ్ఞాన, విజ్ఞాన, మోక్షములనుకూడా
అనుగ్రహిస్తాడు. ఈ విధమైన దర్శనమే దుర్లభమైన మానవజన్మ
లభించినందుకు ఉపాసనగా సాధించుకోవలసిన పరమార్థం. ఇదీ