2023-05-28 17:35:36 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనం
ఈ సంధ్యోపాసన లేదా సంధ్యావందనం అందరూ చేసుకోవచ్చా?
అనే సందేహం సగటుమనిషికి కలగడం సహజం. నిరభ్యంతరంగా
ఆబాలగోపాలము స్త్రీ పురుషులందరూ చేసుకోవచ్చును. అందుకే ఈపుస్తకం.
పూర్వకాలంలో స్త్రీలకుకూడా సంధ్యాంగములుగా ఉపదేశింపబడే
గాయత్రీ,సావిత్ర్యాది మంత్రోపదేశములు, మౌంజీబంధ నాది
సంస్కారములున్నట్లు ఉల్లేఖములు కలవు, శబ్దకల్పద్రుమంలో-
"స్త్రీశూద్రాదీనాం వైదిక్యాః స్థానే తాంత్రికీ సంధ్యా ఉపదిష్టా. స్త్రీణామపి
సంధ్యాధికారః స్మర్యతే వాల్మీకినా-
"సంధ్యాకాలమనాః శ్యామా ధ్రువమేష్యతి జానకీ।
నదీం చేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణినీ"॥ ఇతి-అని
చెప్పబడినది. స్త్రీశూద్రాదులకు వైదికసంధ్యోపాసనకు బదులుగా
తాంత్రికసంధ్యోపాసన విధింపబడినది. తాంత్రికమన్నంతమాత్రాన అదేదో
క్షుద్రపూజలాంటిదని అనుకుంటామేమోనని స్త్రీలకీ విధమైన
సంధ్యాధికారమును వాల్మీకిమహర్షికూడా నిర్దేశించేడని- 'హనుమ
అశోకవనిలో సంధ్యాసమయంలో పవిత్రజలములుగల ఒక నదిని చూచి,
'సకాలములో సంధ్యనుపాసించు స్వభావముకల జానకి సంధ్యోపాసనమునకై
పుణ్యజలములుకల ఈ నదివద్దకు నిశ్చయముగా వచ్చితీరునని తలంచినట్లు
పేర్కొనినాడు'-అని స్పష్టముగా నుదాహరింపబడినది.
సంధ్యాసమయములలో ఉపాసింపదగిన దివ్యచైతన్య తేజోమయమూర్తియైన
సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షదైవము!
ఈ విషయంలో ఎవ్వరికీ విప్రతిపత్తి ఉండదు. కారణం మనమందరం మనకు
జ్ఞానం తెలిసినది మొదలు ప్రతిరోజూ ఆయనను చూస్తూనే ఉన్నాం. ఆయనను
దర్శించడానికి రుసుము అంటే టిక్కెట్టు అక్కర్లేదు. ఆయనను ఆశ్రయించి
తరించాలంటే మాత్రం మనమాయనకు అనన్యశరణాగతిపూర్వకమైన భక్తితో
సరిగ్గా సంధ్యవేళలలో వందనమాచరించాలి, అంటే, నమస్కరించాలన్నమాట!
10