This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
9
 
ప్రవేశిక
 
అంతరంగం అంటే మనసులో మాట. మనలో మన మాట. 'అందరికీ
సంధ్యావందనం'- అనే ఈ పుస్తకం అందరికోసం వ్రాయబడినది.
సంధ్యావందనమనేది త్రైవర్ణికులలో కొందరికి మాత్రమే నిర్దేశింపబడినదిగా
వ్యవహారంలో కనిపిస్తున్నది. తత్త్వమాలోచిస్తే సంధ్యావందనము లేదా
సంధ్యోపాసనకు అందరూ అర్హులే నని తెలుస్తుంది. ఆ విషయాన్ని కొద్దిగా
ముచ్చటించుకుందాం.
 
సంధ్యావందనం అంటే ఏమిటి?
 
సంధ్యావందనం అనే పదంలో సంధ్య, వందనం అనే రెండు పదాలు
కనిపిస్తాయి. 'సమ్యక్ ధ్యాయంత్యస్యామితి సంధ్యా' - అంటే చక్కగా ధ్యానము
చేసుకోడానికి అనువైన కాలమని భావం. వందనమనగా నమస్కారమని
అర్థం. దివ్యత్వముకల గొప్ప వ్యక్తిని అనన్యశరణ్య భావముతో చేతులు జోడించి
ఆశ్రయించే ప్రక్రియ నమస్కారమని నిర్వచింపబడినది. కాగా -
సంధ్యావందనమంటే సరియైన సమయంలో మన (ఇష్టదైవాన్ని అనన్య భక్తి
భావనతో ఆశ్రయించి ఉపాసించడమని స్థూలంగా అర్థాన్ని చెప్పుకోవచ్చు.
 
దివ్యత్వమును సంతరించుకొని మనలను, ప్రతిరోజూ కన్ను తెరచినది
మొదలు కన్నుమూసుకునే వరకు, తనదైన దివ్యచైతన్యాన్ని మనకందజేస్తూ,
అన్నివిధాలుగా మనను ఆయురారోగ్యాలతో అవిశ్రాంతముగా సంరక్షిస్తున్న
ప్రత్యక్షదైవమైన సూర్యనారాయణుడే సంధ్యాసమయములలో
ఉపాసింపదగినవాడని అనుభవజ్ఞులు శ్రేయోభిలాషులు అయిన మన
మహర్షులు ఉపదేశించి- ఈ సంధ్యోపాసనను ప్రతీవారు విధిగా నిర్వర్తించి
తరించాలని, ఇదే మానవజన్మలభించినందుకు మన కర్తవ్యమని,
ప్రతిబోధించారు. ప్రతి బోధించారు. సరే!