2023-05-28 17:35:35 by ambuda-bot
This page has not been fully proofread.
8
అందరికీ సంధ్యావందనం
హృల్లేఖ
1985వ సంవత్సరంలో నేను గుంటూరు కృష్ణనగర్ లో మా గురువర్యులు
బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రిగారింట్లో సుమారు ఒక నెలరోజులపాటు
అంతేవాసిగా ఉండడం తటస్థించింది. ఆసమయంలో నేను వారివద్ద
ప్రాసంగికముగా అనేక విషయములు తెలిసికోవడమే కాకుండా వారినుండి
మంత్రదీక్షను కూడా పొంది ధన్యుడనయ్యాను. వారు
త్రికాలసంధ్యావందనపరాయణులు. నేను వారింట్లో అంతేవాసిగానున్న
రోజులలో మా కల్యాణానందభారతీసంప్రదాయానుగుణంగా శ్రీయాగమునకు
సంబంధించిన విశేషములతోపాటు, శ్రీచరణులు అన్ని వర్ణములవారికి
స్త్రీపురుష భేదంలేకుండా 'సర్వవర్ణులకు సంధ్యోపాసన' అనే చిన్న పుస్తకాన్ని
1953వ సం॥లో ప్రకటించినట్లు తెలిపి, స్త్రీలకుకూడా సంధ్యోపాసనకర్హత
ఉన్నదని ఆ పాత ప్రతిని చూపి చెప్పారు.
తరువాత ఆ గ్రంథాన్ని మా సంప్రదాయమువారే అయిన బ్రహ్మశ్రీ నోరి
సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వారి ట్రస్టు తరపున 2012లో శ్రీచరణులజన్మదిన
సందర్భముగా 1500 ప్రతులు ముద్రించి వితరణ చేశారు.
కల్యాణశ్రీచరణులు నాకు పరమగురువులు. జగద్గురుమ హెూపదేశముగ వారి
విశ్వకల్యాణకామనను ప్రస్తుతదేశకాలములకనుగుణముగా వివరిస్తూ, వారి
మార్గదర్శనములోనే-"అందరికీ సంధ్యావందనము" అనే ఈ పుస్తకము
మీకందించబడుచున్నది. అందరూ దీనిని యథాయోగ్యముగా గ్రహించి
గురుకృపాశీస్సులతో తరించాలని ఆశిస్తున్నాను.
'శ్రీపాదు''
అమూశీర్వ
కాశీవాసి.