This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
His Holiness, Courtallam Sankaracharya jagadguru
SRI SIDDHESWARANANDA BHARATI SWAMY
Peetadhipati - Siddheswari Peetam
 
పరమహంస పరివ్రాజకాచార్య.
 
జగద్గురు శ్రీసిద్ధేశ్వరానందభారతీ స్వామి
 
సిద్దేశ్వరీ పీఠాధిపతి-కుర్తాళం
 
iii
 
Off.: Mounaswamy Mutt, Courtallam-627802.Thirunelveli, Tamilnadu, Ph: 04633-283707
Camp Off.: Swayam Siddha Kali Peetham, 4th Line, Ravindra Nagar, Guntur-522-006 (A.P)
 
Date: 17-05-2023
 
ఆశీర్వాదశ్రీముఖము
 
బ్రహ్మశ్రీ కొల్లూరు అవతారశర్మగారు విద్వద్వరేణ్యులు. అధ్యాత్మిక సాధనతో జీవితాన్ని
సఫలం చేసికొంటున్న భక్తులు. నిత్యకాశీవాసి. వారిదివరకే చాలా గ్రంథాలు రచించారు.
ప్రజ్ఞాప్రాభవ భారతీభాసితులు. అటువంటి విబుధవర్యులు ఇప్పుడు 'అందరికీ
సంధ్యావందనం' అనే నూతన గ్రంథాన్ని సంధానం చేశారు. 'అహరహస్సంధ్యాముపాసీత'
అని శాస్త్రవాక్కు. సంధ్యావందనం చేసి తీరాలనేది పెద్దల మాట. ప్రామాణికమైన
అభిభాషణ.
 
ఉపనయనం అయినవారు సంధ్యావందనం ఎలా చేయాలో పండితులకు వైదికులకు
సువిదితం. కానివారు ఎలా చేయాలో శాస్త్రాంగీకృతమార్గం వీరు తెలియజేశారు. అందుచేత
ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి విధానం. హెూమవిషయంలో కూడా ఇటువంటి
విశ్లేషణే ఉంది. వైదికమైన పద్దతితోపాటు మేరుతంత్రాది గ్రంథాలలో ద్విజేతరులు,
స్త్రీలు, అందరూ చేయదగిన హెూమపద్ధతి తెలియజేయబడింది.
 
దేశం కాలం మారుతూ ఉంటాయి. సంధ్యాసమయాలలో ఎవరు ఎక్కడ
ఉంటారో చెప్పలేని స్థితి. కనుక స్మరణపూర్వకంగా మనస్సులో భావించటం ఒకమార్గం.
అయితే దానికైనా సంకల్పం కలగాలి గదా! అలా కలిగించే శక్తి ఈ గ్రంథానికి
ఉన్నది. ఒకసారి ఓపిక చేసుకుని చదివితే మనస్సుమీద ప్రభావం తప్పక చూపిస్తుంది.
అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అవతారశర్మగారు చేసిన యీ కృషి సఫలం కావాలని
ఆశీర్వదిస్తున్నాను.
 
శోభకృత్ వైశాఖం
బహుళత్రయోదశీ బుధవారం.
 
నారాయణస్మరణతో
సం.సిద్ధేశ్వరానందభారతీస్వామి.