This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
ii
 
శ్రీశృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠము
 
శ్రీశంకరపదమావిశప్రకాశిక భారతీసంప్రదాయ సార్వభౌమ
జగద్గురు శ్రీశ్రీశ్రీ గంభీరానందభారతీస్వామి
శ్రీసదనము, ఆరండల్ పేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522002
 
ఓం శ్రీమాత్రే నమః
 
బ్రహ్మీభూత శ్రీకల్యాణానందభారతీ మాంతాచార్య మహస్వామివారిచే
ప్రసాదింపబడిన 'సర్వవర్థులకు సంధ్యావందనము'అను గ్రంథమును
పరిశీలించి, అందరకూతెలిసికోదగిన భాషలో 'అందరికీ సంధ్యావందనము'
అనే ఈ పుస్తకాన్ని శ్రీపాదుకానామధేయముతో ప్రసిద్ధులగు బ్రహ్మశ్రీ కొల్లూరు
అవతారశర్మగారు అందించినారు.
 
చాలామందిలో సంధ్యావందనము బ్రాహ్మణులకుమాత్రమేనను అపోహ
కలదు. త్రైవర్నికులందరకు సంధ్యోపాసన విహితమై యున్నది.
 
తేయింబవళ్లను విభజించు సూర్యోదయాస్తమయముల సంధికాలములకు
సంధ్య అని పేరు. ఈ సంధ్యాసమయములత్యంత శక్తిమంతములైనవి.
ఈ సమయములలో గాయత్రీమంమ్రునుపాసించుటవలన ఓజస్సు, తేజస్సు,
ఆయుష్షు, సంపద సర్వము లభిస్తాయి. అందరు ఈ పుస్తకములో చెప్పబడిన
విధానమును యథావిధిగా ఆచరించి సంధ్యాశక్తిని పొందగలరు. గురుముఖతః
చెప్పించుకుని స్పష్టముగా పలుకుబడి సిద్దించువరకు సాధనచేయగలరు.
సాధకులకీ పుస్తకమునందజేసిన శ్రీ అవతారశర్మగారు ధన్యులు.
అభినందనీయులు.
 
నారాయణస్మృతయః
 
శోభకృత్.
 
వైశాఖ బహుళ సప్తమీ శుక్రవారము.
 
సం. గంభీరానందభారతీస్వామి