This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
నోరి నరసింహశాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ (రిజిస్టర్డ్)
 
అధ్యక్షులు
నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు
'శ్రీగిరి' 1-26 స్నేహపురి
 
నాచారం హైదరాబాద్-500076.
 
NARAS
 
NORI
 
SASTRY
 
CHARITABLE
 
HYDERABAD
 
TRUST
 
xviii
 
సంధ్యాయై నమః
 
ఆచార్య కొల్లూరు అవతారశర్మగారు ఆధ్యాత్మిక గ్రంథాలరచయితగా
ప్రసిద్ధులు. ఇంతకుముందు ఎన్నో పూజాకల్పాలు వ్రాశారు. ఇప్పుడు "అందరికీ
సంధ్యావందనం" అనే చిరు గ్రంథాన్ని అందిస్తున్నారు.
 
త్రైవర్ణిక పురుషులు మాత్రమే సంధ్యావందనము చేయుట
సంప్రదాయము. అయితే సీతాదేవి సంధ్యోపాసన చేసినట్లుగా వాల్మీకి మహర్షి
రామాయణంలో వ్రాశారుకదా! అనే సందేహం కలుగుతుంది.
అస్మద్గురువర్యులు, అపరవ్యాసులు, శ్రీశృంగేరీ శ్రీవిరూపాక్ష పీఠాధిపతులు
జగద్గురు శ్రీశ్రీశ్రీ కల్యాణానందభారతీ మాంతాచార్య మహాస్వామివారు
సుమారు శతాబ్దముట్రందటే "సర్వవర్ణులకు సంధ్యావందనము" అనే
సులభాచరణ గ్రంథాన్ని రచించి లోకానికి అందించి అనుగ్రహించారు.
 
శ్రీ అవతారశర్మగారు అదేమార్గంలో ఈ గ్రంథాన్ని రచించారు. అందరూ
సంధ్యావందనము చేయవచ్చు. చేయాలి అనే విషయమును వారు
సోదాహరణంగా సప్రమాణంగా ప్రతిపాదించారు. సంధ్యావందనం అంటే
ఏమిటి?... సంధ్యావందనపరమార్థం వంటి విషయాలను వివరిస్తూ, సంధ్యా
సమయం సూర్యోపాసనలనెప్పుడెలా చెయ్యాలి దానికి కావలిసిన సామగ్రి,
అన్నీ బొమ్మలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేరు.
 
తరువాత వారు త్రికాలసంధ్యావందనాలు చేయాల్సిన పద్దతిని వ్రాశారు.
ఈ త్రికాలములలో జపించవలసిన శ్లోకగాయత్రీ మంత్రమును,
సంధ్యాగాయత్రీమంత్రములను వ్రాశారు. సంకల్పము తత్వాచమునము,