This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
శ్రీవీరవేంకటసత్యనారాయణస్వామివారి దేవస్థానం
అన్నవరం- 533406. తూ.గో. జిల్లా. (ఆం.ప్ర). ఇండియా
 
xvii
 
'ఘనరత్న" - 'స్వర్ణకంకణ సన్మానగ్రహీత'
 
గొల్లపల్లి వెంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి యం.ఏ (సం).
అన్నవరం దేవస్థాన వేదపండితులు,
 
సెల్ నం. 9848641220. www.sumuhurtham.in
 
సాస్మాన్ సంధ్యాభిరక్షతు!
 
సంధ్యావందనము త్రైవర్ణికులకు నిత్యవిధిగా విధింపబడినా శ్రోత్రియకుటుంబాలకు
చెందిన యేకొద్దిమందో తప్ప అందరూ శ్రద్ధాభక్తులతో ఆచరించడం లేదు.
కారణాలనేకం. శ్రద్ధాళువులైన ఇతరవర్ణములవారు ఆస్తిక్యబుద్ధితో
ధర్మకార్యాచరణతత్పరులై యున్నారు. ఇలాంటివారందరికోసం శ్రీపాదుక
అవతారశర్మగారు 'అందరికీ సంధ్యావందన'మనే ఈ పుస్తకాన్ని
అవతరింపచేశారు. ఇందులో వారు ఋషి సంప్రదాయములోనే 'తాంత్రిక
సంధ్యావందనము'గా చెప్పబడుచున్న విషములను ప్రామాణికమైన పద్ధతిలో
స్త్రీపురుషులు అందరూ సంధ్యావందనమును చేసికొని తరించవచ్చునని అది
అందరి కర్తవ్యముకూడా అని నిరూపించేరు.
 
సంధ్యావంనములోని మఖ్యోద్దేశమేమంటే- 'నా పాపములను పరిహరించి నన్ను
పవిత్రుని గావించు' డని, సూర్యుని, సంధ్యాదేవతలను, ఋషిగణములను
నమస్కారపూర్వకముగా ప్రార్థించి వారి ఆశీరనుగ్రహములను పొంది తరించడమే!
సంధ్యా'ందనమును ప్రారంభించిన నాటినుండి శరీరమున్నంతవరకు నిత్యవిధిగా
దానినాచరిస్తూ, నేను చేసిన సర్వకర్మలను 'నారాయణాయేతి సమర్పయామి'అని
ఆపరమేశ్వరునికి సమర్పిస్తూ, ఉత్తమమమైన జీవయాత్రను సాగించాలి. ఇదే
'సంధ్యావందన పరమార్థం!' దీనివల్ల ఆత్మోన్నతితో పాటు సమాజసంక్షేమం,
విశ్వకల్యాణం సిద్ధిస్తాయి. అందరూ తరిస్తారు. శ్రీపాదుక అవతారశర్మగారి
. ఆశయమూ నెరవేరుతుంది.
 
లోకాస్సమస్తాః సుఖినో భవంతు.
 
8.15-05-2023. సం.గొల్లపల్లి వెంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి.