2023-05-28 17:35:33 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనము
V. SESHAPHANI SARMA
Department of Telugu
Sri Satyasai Higher Secondary Schol,
Vidya Giri - Prashantinilayam-515134.
Anantapur District Andhra Pradesh
Email:seshaphanisharma@ssshss.org.in
Higher
xvi
పుట్టపర్తి,
శోభకృత్ జ్యేష్ఠశుక్ల ప్రతిపత్. భృగువాసరము.
Secondary
ఓం శ్రీ సాయిరామ్
సౌహార్ద ప్రశంస
'శ్రీపాదుక' డా॥కొల్లూరు అవతారశర్మగారు రచించిన 'అందరికీ సంధ్యావందనము'
అనే ఈ చిన్ని పుస్తకం గుణగౌరవంచేత గొప్ప పుస్తకంగా కీర్తినందగలదు. సాధారణంగా
భారతదేశంలోని బ్రహ్మణక్షత్రియవైశ్యులనే త్రైవర్ణికులకు మాత్రమే సంధ్యావందనార్హత.
అదియును పురుషులకు మాత్రమే! అనే భావన రూఢమై యున్నది. సంధ్యావందనముయొక్క
ప్రయోజనములు చాలా ఉన్నను అవి అందరికీ అందని స్థితి నేడు నెలకొనియున్నది. కాని
ప్రస్తుతము ఆ త్రైవర్ణికులుకూడ దీనియందంతగా శ్రద్ధవహించని పిదపకాలములో
మనమున్నాము. అట్టి స్థితిలో శ్రీఅవతారశర్మగారు సుగతి ప్రదాయకమైన దీని ప్రాశస్త్యమును,
ఆవశ్యకమును చక్కగా వివరించడమేకాక అందరూ దీనిని పొందాలనే విశాల దృక్పథంతో
ఈ గ్రంథమును సిద్ధము చేసినారు. ఏవర్ణమువారైనను, ఏ దేశమువారైనను, స్త్రీలైనను,
బాలురైనను దీనినుపాసించవచ్చుననియు, ఉపాసించి తీరవలెననియు, నొక్కి వక్కాణించుచు
సప్రమాణముగా నిరూపించినారు. పురాణకాలమునుండి ఈ సంప్రదాయము ఉన్నదని ఎన్నో
ఉదాహరణములనిచ్చియున్నారు. ఇది పెద్దలందరు అంగీకరించినదేయని వారి వచనములను
మనముందుంచినారు.
8. 19-5-2023.
దీనిని ఎవ్వరెవ్వరెలా ఎలా ఆచరించాలో శ్రీపాదుకా సంధ్యాకల్పమనే పేరుతో ఈ చిన్న
విశిష్టగ్రంథభాగమున సచిత్రముగా వివరించుట జరిగినది. దీనిని శ్రద్ధగా చదివి, అర్థము
చేసుకొని, ఆచరణకుపక్రమించి, అందరూ తరించాలనీ, అందరూ బాగుండాలనీ కోరుతున్న
వారి ఆకాంక్షతో నేనును శ్రుతికలుపుతూ ముగిస్తున్నాను. ఇది అందరిలో శుభ పరిణామమును
తీసుకొనివచ్చి, భరతదేశపు సంస్కృతి, సంద్రాయమూ విశ్వవ్యాప్తమై, విశ్వకల్యాణదాయకమై
వెలుగునట్లు చేయగలదని ఆశిస్తున్నాను.
ఇట్లు విన్నవించు సుధీవిధేయుడు
సం.వింజమూరి శేషఫణి శర్మ.