This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
వినియోగిస్తున్నారు. వారు చేస్తున్నది సంధ్యా'ందనమే! వందనమంటే నమస్కారం.
అదే వారి నమాజ్కారం! ఇలా అన్యమతాలు మనమార్గాన్నే ప్రత్యేకముగా స్వీకరించి
అనుసరిస్తూ ఉండగా, 'మన హిందువులలోనే అది లోపించుచున్నదే!' అనే
ఆవేదనతో శ్రీపాదుక అవతారశర్మగారు ఇలా మార్గదర్శనం చేయటం చాలా
శ్రేయస్కరమైన విషయం.
 
సంధ్యావందనమనేది నిజానికి మానవాళికంతకూ కర్తవ్యమయినదే. కాని,
అనంతరకాలంలో ఉపనీతులైన వారికే, అంటే బ్రాహ్మణ, క్షత్రియ,
 
వైశ్యులనే త్రైవర్ణికులకే పరిమితమై, మరికొంతకాలానికి కేవలం బ్రాహ్మణులకే
అందునా శ్రోత్రియులకు మాత్రమే సంబంధించినదిగా పరిమితమైపోతున్నది.
ఇటువంటి దుస్థితిలో శ్రీఅవతారశర్మగారు మరల సంధ్యావందనాన్ని విస్తృతంగా
ఆరంభస్థితికి తీసికొనివెళుతూ -"అందరికీ సంధ్యాందనం" అనే ఈ అద్భుత
రచన చేసి సమాజం ముందుంచారు. ప్రతివ్యక్తీ దీనిని చదవాలి. సమాజం శర్మగారి
ఆవేదనను వారి మార్గదర్శనమును గ్రహించాలి. దానిని ప్రతీ వ్యక్తీ ఆచరణలో
పెట్టాలి. సంధ్యావందనములో భాగమైన గాయత్ర్యుపాసన ద్వారా సద్బుద్ధి
సదాచారము కలుగుతాయి. ఆరోగ్యం మనశ్శాంతి లభిస్తాయి. అట్టి
సంధ్యావందనమునకన్నివిధములుగా శ్రీశర్మగారు ఈ గ్రంథంలో
మార్గదర్శనంచేశారు. వైదిక సంప్రదాయవాదులకు కూడా కాదనుటకు వీలులేని
రీతిగా విధానమును రూపొందించారు. శ్రీశర్మగారి లోకసంగ్రహణేచ్ఛకు పునః
పునః నమోవాకములర్పించుకొంటున్నాను. వారి ఆశయాన్ని అర్థంచేసికొని ప్రతివ్యక్తీ
సంధ్యావందనమునాచరిస్తూ ఐహిక, పారమార్థిక ప్రయోజనములను
సాధించుకొనవలెనని కోరుకుంటున్నాను.
 
చీరాల,
 
శోభకృద్వైశాఖం
హనుమజ్జయంతి.
 
XV
 
ఇట్లు,
సుజనవిధేయుడు,
 
అన్నదానం చిదంబరశాస్త్రి.