This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
డా. అన్నదానం చిదంబరశాస్త్రి
'సంపాదకులు' సనాతన ధర్మజ్యోతి,
ఆధ్యాత్మికమాసపత్రిక,
1-28-8 శ్రీరామ్నగర్, వైకుంంఠపురం,
చీరాల-523 155 (ఆం.ప్ర)
ఫోన్-9848666973.
 
ఓం శ్రీరామ -జయ హనుమన్!
అనుసరిద్దాం!-ఆచరిద్దాం!!
 
xiv
 
మహనీయుల సమాలోచన నిరంతరం సమాజశ్రేయస్సుగూర్చే
ఉంటుంది. ఆకారణంగానే వేదశాస్త్రపురాణాదికమైన సాహిత్యమంతా మహర్షులచే
మనకందింపబడినది. ఋషిసత్తములందించిన, వానికే- దేశకాలమాన
పరిస్థితులనుబట్టి మహనీయులు తమరీతిగా మార్గదర్శనం చేస్తూ ఉంటారు.
శ్రీకొల్లూరు అవతారశర్మగారు నిరంతరం లోకశ్రేయస్సును కాంక్షించే
మహనీయులు. వారు సమాజశ్రేయస్సుకోసం అనుష్ఠానాలు చేయించారు. ఆనేక
యజ్ఞాలు నిర్వహించారు. తమ కలమును గళమును నిరంతరము అందుకే
వినియోగిస్తున్నారు.
 
హిందూధర్మమునకు అతీతమైనదేదీ లేదు. ఇతరమతాలవారు మన
ధర్మంచెప్పిన విషయాలనే సంగ్రహించుకుని నియమబద్ధంగా అనుసరిస్తున్నారు.
ఎన్నో కాలాలు, ఎందరో దేవతలు, అనుకునే భారతీయులుమాత్రం ఎవ్వరినీ
అనుసరించటం లేదు. మన ధర్మం ప్రత్యక్షదైవమైన సూర్యునకు ఎంతో
ప్రాధాన్యమునిచ్చింది. అదంతా సంధ్యావందనంలో కనబడుతుంది. అట్టి సూర్యుని
దృష్టియందుంచుకొని సూర్యదివసమైన ఆదివారము (SUNDAY)ను క్రైస్తవులు
ప్రార్థనాదినము (PRAYER DAY)గా చేసికొన్నారు. అదే సూర్యుని గమనములోని
కీలకసమయాలైన సంధ్యాసమయాలు దైవప్రార్థనకత్యంత ముఖ్యమైనవి కావున
ఆ సంధిసమయములనే మహమ్మదీయులు నమాజ్కు స్వీకరించి