This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
మందిరంగా, శివానంద సౌందర్యలహరులను ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలుగా
చేసుకుని, కాశీవాసులై సాధకలోకానికి పంచుతున్న గంగాతీర్థం
ఈ సంధ్యావందనవిధి. వారికి సాధకలోకం ఋణపడియుంటుందని
భావిస్తున్నాను. సాధకులందరు శ్రేయస్కాములై, సకాలములలో
సంధ్యనుపాసిస్తూ, శ్రీశర్మగారి అభిమతాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను.
ఉపనయనసంస్కారంలో తండ్రి కుమారునికి గాయత్రీమంత్రాన్ని కర్ణాకర్ణిగా
ఉపదేశించడం సంద్రాయం. ప్రస్తుతం ఆ పితృస్థానాన్ని పూజ్యులు శ్రీశర్మగారు
స్వీకరించి, సాధకలోకానికి యిలా పుస్తకమాధ్యమంద్వారా బోధచేయడం 'పితృ'
శబ్దాన్ని సార్థకం చేయటమే!
 
"యాగ్ం సదా సర్వ భూతాని స్థావరాణి చరాణిచ
 
సాయం ప్రాతర్నమస్యన్తి సా (మా) నః సంధ్యాభిరక్షతు।" –
 
xiii
 
ఏ సంధ్యాదేవతను ప్రాతస్సాయం సంధ్యలలో చరారచరప్రాణిజాతమంతయు
నమస్కరిస్తున్నదో, ఆ సంధ్యాదేవత (నన్ను) మనలను రక్షించుగాక!
 
వారణాసి,
12-5-2023.
 
సం. ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు
తెలుగు శాఖాధ్యక్షులు.