This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
काशी हिन्दू
विश्वविद्यालये
 
BANARAS HINDU
UNIVERSITY
 
ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు.
 
తెలుగు శాఖాధ్యక్షులు
 
xii
 
చేర్చుక్క
 
సంధ్యనుపాసించటమంటే ప్రకృతిని ఉపాసించడమే. అదొక నియమంగా
చేసి సూర్యశక్తిని ఆవాహనచేసికొనే క్రమాన్ని, ఆ సంధ్యావందనవిధిలో మన
పూర్వులు పొందుపరచారు. ఈ సృష్టివికాసానికి ప్రాథమికమైన శక్తిగా భావించే
సూర్యుడిని లోకమిత్రుడిని చేసింది మన ఆర్య సంస్కృతి. ఛందోమయవాక్కు
శ్వాసను క్రమబద్ధీకరించి ప్రాణశక్తిని ఇనుమడింప చేస్తుందని శాస్త్రవేత్తలు
నిరూపించిన అంశమే గాయత్రీమంత్రము. దానిని నిత్యవిధిగా
సంధ్యోపాసనమనే సంస్కారముగా నిర్దేశించిన మన ఋషుల అవ్యాజకరుణకు
కైమోడ్పులర్పించ వలసినదే!
 
అటువంటి సంధ్యావందనవిధిని మనందరికీ ప్రసాదంలా పంచిపెడుతున్న
గురువర్యులు శ్రీపాదుక కొల్లూరు అవతారశర్మగారు మనందరికీ
వందనీయులు. గాలిలా, నీటిలా అందరికీ అందవలసిన ఈ ఆధ్యాత్మిక విద్యకు
ఎల్లలేమిటి? మనుసంతతివారం మనం. అంటే, మనమందరం మానవులం.
అందరూ అఖండచైతన్యంలో భాగమే. 'బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ
చాంత్యాయ చ' అని శుక్లయజుర్వేదంలో చెప్పినవిధంగా అందరూ ఈ విధికి
అర్హులే! సాధనచేయాలన్న బుద్ధికలిగి మననం సానుకూలం చేసికున్న
ప్రతివాడూ ఈ సంధ్యావందనవిధిని నిర్వర్తించడానికి అర్హుడే. దానికి
లింగ,వర్ణ,వయో భేదాలేవీ లేవని, మానవాళి తరించటంకంటే తనకు
ప్రయోజనంలేదని శ్రీరంగం గోపురమునెక్కి, ద్వయమంత్రమును భక్తకోటికి
అనుగ్రహించిన, రామానుజులవారిలా, ఆర్షవిద్యాసంపదను జగతికి
పంచుతున్న పూజ్యులు శ్రీఅవతారశర్మగారు, నిత్యానుష్ఠానవిధులతో మనసును