This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
'అభినవ మల్లినాథ' 'అవధానప్రాచార్య' పురాణవాచస్పతి' 'పద్యకళాతపస్వి' ।
ధూళిపాళ మహదేవమణి
 
'విశ్రాంతాచార్యులు
 
రాజమహేంద్రవరం. సెల్ 9494002247.
 
X
 
ది. 19-5-2023
 
లోకబాంధవమ్
 
శ్రీపాదుకా సంధ్యాకల్పమైన ఈ గ్రంథాన్ని మంత్రానుష్ఠానగరిష్ఠులూ,
శిష్యానుగ్రహవరిష్ఠులూ, విద్వత్తల్లజులూ, శ్రీకల్యాణానందభారతీ సంప్రదాయ
ప్రవర్తకులూ అయిన బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి చరణుల
శిష్యవరేణ్యులూ, శ్రీమాతృచరణచారణమిళిందులూ, నైకకృతి విధాతృలూ ఐన
అస్మదాప్తమిత్రులు బ్రహ్మశ్రీ కొల్లూరు అవతారశర్మగారు రూపకల్పన చేశారు.
 
మనకు సంధ్యావందనాల ఆచరణలో ఋగాది సంప్రదాయాలు ఆయా
వేదశాఖలవారికి నియతాలైనాయి. మన పెద్దలు ఏమాత్రం వానిని నిరాదరణ
చేయకుండా పరిపాలించే ఉన్నారు.
 
ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయాలన్నీ ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్నాయి.
అవీ త్రైవర్ణికులకు మాత్రమే నియమితాలౌతున్నాయి. ఆ పద్ధతి సార్వజనీన
సముద్ధరణము కాదని కొందరు విజ్ఞులు సర్వ సముద్ధరణ కోసం ఈ మార్గాన్ని
దర్శించారు. ఇది కొందరికి నచ్చకపోయినా కాలక్రమేణ అర్థం చేసికోగలరు.
ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపే మార్గం. ద్వైతంనుండి అద్వైతానికి
ప్రయాణించడం ఎంత ముఖ్యమో ఇదీ అంతే. అసలు యౌగికార్థంలో
సంధ్యావందనశబ్దానికి ఉన్న అర్థం అదే.
 
సంధ్యాయాం వందనమ్- సంధాయసమయంలో చేసే నమస్క్రియ అనే
కదా ఆ శబ్దానికర్థం. దాన్ని రూఢిగా నిర్ణయించుకుని ఆచరణసంకోచం
చేయడం కంటే యౌగికార్థంలో సర్వజనాదరణంగా నిస్తృతం చెయ్యడమే
సముచితమైన మార్గం. నిజానికి సంప్రదాయాభిజ్ఞులైన శ్రీ అవతారశర్మగారు
ఈ మార్గాన్ని అంగీకరించడమే గొప్ప సంస్కారం.
 
ఇందులో శర్మగారు సంప్రదాయాన్ని తగ్గించలేదు. ఈ పరిధిలోకి
రానివారికి, త్రైవర్ణికులైనా ఏవో కారణాలచే చెయ్యనివారికి, చేసినా మంత్రం
సుస్వరంగా గురుముఖంగా నేర్చుకోడం కుదరనివారికి, ఇలా ఏయే