2023-02-27 21:58:06 by ambuda-bot
This page has not been fully proofread.
డా॥ చేరెడ్డి మస్తాన్రెడ్డి
ఎం.ఏ., పిహెచ్.డి
ప్రిన్సిపాల్
ఎస్.కె.ఆర్.బి.ఆర్. కళాశాల
నరసరావుపేట -522601.
డా॥ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.
లెక్చరర్, తెలుగు విభాగం
ఎస్.కె.ఆర్.బి.ఆర్. కళాశాల
నరసరావుపేట - 522601.
మదాలస
కవికుల గురువు కాళిదాసు కాళీమాత అనుగ్రహం వల్ల కవన శక్తిని పొంది
రఘువంశాది కావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలాది నాటకాలను రచించాడు. భక్తినిర్భరమైన
అనేక స్తుతులను కూడా రచించాడు. వాటిలో ఈ దేవీ అశ్వధాటి ఒకటి.
కాళిదాసు దృష్టిలో జగతఃపితరులైన పార్వతీపరమేశ్వరులు వాగర్థాల లాంటివారు.
అందుచేతనే కాళిదాసు శబ్దస్థానీయురాలైన పార్వతీదేవిని శబ్ద ప్రధానమైన అశ్వధాటీ
వృత్తాలలో ప్రస్తుతించాడు.
అశ్వధాటి పాదానికి 22 అక్షరాలు కలిగిన ఆకృతిచ్ఛందోజాతం. ఇందులో 4
పాదాలుంటై. ప్రతిపాదంలోను త భ య జ స ర స గ అనే గణాలుంటై. 7-14 అక్షరాలు
యతి స్థానాలు. కనుక 8-15 అక్షరాలలో ప్రాసయతి ఉంటుంది. అంటే ప్రతి పాదంలోను
2- 9- 16 అక్షరాలు సమంగా ఉండాలి. ఆ ప్రాసయతిలో హల్సామ్యంతోబాటు అచ్సామ్యం
గూడా ఉంటే గమనం అందగిస్తుంది. కేవలం హల్సామ్యం మాత్రమే ఉండటం
దోషంకాదుగాని ఆ సౌందర్యం మందగిస్తుంది. సంస్కృత కవులలో కొంతమంది ఏ పాదానికి
ఆ పాదాన్నే ప్రత్యేకంగా పరిగణించి వివిధ హల్లులతో ప్రాసయతిని ప్రయోగించారు. కాని
అది శోభావహంగా లేదు. మన తెలుగు వృత్తాలలో ప్రాస నియమం నిత్యం కనుక, నాలుగు
పాదాలలో రకరకాల హల్లులను ప్రాసయతిగా ప్రయోగించే అవకాశంలేదు.
కాళిదాసు దేవీ అశ్వధాటిలో నాలుగు పాదాలను ఒకే భాగంగా గ్రహించి ఒకే అచ్చుతో
కూడిన హల్లును ప్రయోగించాడు. కానీ, దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ అనే 9వ శ్లోకంలోని
నాలుగవ పాదం మాత్రం దీనికి అపవాదం.
ఈ అశ్వధాటీ వృత్తానికి సితస్తబక, మదాలస, మత్తేభాది నామాంతరా లున్నప్పటికీ
గమన కామనీయకాన్నిబట్టి అశ్వధాటి అనే పేరే సార్థకం.
కాళిదాస కృతమైన ఈ 13 శ్లోకాలను దేవీప్రణవశ్లోకి, అంబాస్తుతి, కాళీస్తుతి - ఈ
విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో వ్యవహరిస్తున్నారు. కొంతమంది వీటిలో నుండి 8
శ్లోకాలను మాత్రమే తీసుకొని అంబాష్టకం అని, పదిశ్లోకాలు తీసుకొని దేవీదశశ్లోకి అని
గూడా వ్యవహరిస్తున్నారు. దేవీ తత్త్వాన్ని అతివేలంగా వివరిస్తున్న ఈ 13 శ్లోకాలు అశ్వధాటీ
25