This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
తమ ముంజేతుల మీద చిలుకలను నిలిపి వాటిచేత మృదు మధురంగా మాటాడించటం ఒక
విలాసకళ. వాటితో వినోదించటం రసజ్ఞ లక్షణం. కీరపాణి అయిన దేవిని మృదుమధుర కవితా
ప్రదాయినిగా భావించాడు కాళిదాసు.
 
41
 
భవే హృదయ బంధౌ
 
భవుడు భవానికి హృదయ బంధువు. అతడు ఆమెకు హృదయబంధం. జగద్రూపకుడైన
శివుడికి ఆమె ప్రాణనాడీ స్వరూపిణి. ఇలా పార్వతీ పరమేశ్వరులు ప్రణయైకజీవులు. పార్వతిలాగా
ప్రతి స్త్రీ తన భర్తకు హృదయబంధం కాగలగాలి. అలాగే ప్రతి పతీ పరమశివుడిలాగా తన
భార్యకు హృదయబంధువు కావాలి. అప్పుడే వారిది అరమరికలు లేని ఆదర్శ దాంపత్యం
అవుతుంది.
అతీవరసికా
 
పార్వతీదేవి రసజ్ఞ. శృంగార రస సంపూర్ణ, శృంగార రసాధి దేవత. రసేంద్రియ
స్వరూపిణి. రసమయ జీవన ప్రదాత్రి. భర్తపట్ల ఆమెకుగల అనురాగం అతివలందరికి ఆదర్శం.
రసహృదయలు మాత్రమే వల్లభులకు ప్రాణబంధువులైతారు. వారి ప్రాణగ్రంథు లైతారు. భగ
వత్స్వరూపం ఎప్పుడూ రసస్వరూపమే కదా!
 
సంధావతీ భువన సంధారణే
 
దేవి తన భక్తుల తాప త్రయాలనూ దోషాలనూ రాగ ద్వేషాలనూ అజ్ఞానాన్నీ తొలగించి
వారికి ఐహిక ఆముష్మిక సుఖాలను కలిగిస్తుంది. ఆమె భక్త రక్షణ తత్పర. దుష్టులైన రాక్షసుల
బారి నుండి భక్తులైన దేవతలను పలుమార్లు కాపాడింది. అది తన విధిగా భావిస్తుంది భవాని.
అమృతసింధా వుదార నిలయా
 
శ్లో॥
 
ఆమె సుధాసాగర మధ్యస్థ - సర్వ సౌఖ్యాలకు నిలయమైన అమృత సముద్రంలో
నివసిస్తుంది. ఆమె నివాసాన్ని గూర్చి ఆదిశంకరులు అభివర్ణించారు.
సుధాసింధోర్మధ్యే సుర విటపివాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే ।
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్ ॥
సౌందర్యలహరి
అమృత సముద్రంలో కల్పవృక్షాలతో చుట్టుకొన్న మణిద్వీపం ఒకటి ఉంది. అందులో కదంబ
వనాలతో విలసిల్లే చింతామణి గృహం ఉంది. ఆ లోపల బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులనే
నాలుగు కోళ్ల మంచంమీద ఉన్న సదాశివుడనే పరుపుమీద ఆమెనివాసం. అక్కడ ఆమె
జ్ఞానానంద స్వరూపిణిగా ఉంటుంది.
 
-
 
గంధానుభావ ముహు రద్దాలి పీత కచబంధా
 
పార్వతీదేవి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆమె శిరోజాలు పలు రకాల
పూలతో పరిమళిస్తూ ప్రకాశిస్తాయి. ఆ పూలమీద వాలిన తుమ్మెదలు మకరందాన్ని చిత్తుగా