This page has not been fully proofread.

40
 
దేవీ అశ్వధాటి
 
శ్లో॥ ఇన కీరమణిబద్ధా భవే హృదయబద్ధా వతీవ రసికా
సస్ధావతీ భువన సర్ధారణే ప్యమృత సిద్ధా వుదార నిలయా ।
గన్దానుభావ ముహురస్ధలి పీత కచబస్ధా సమర్పయతు మే
శం ధామభాను మపి రున్దాన మాశు పద సస్ధాన మప్యనుగతా॥ 13
ప్రతిపదార్థం
 
ఇంధాన = ముచ్చటైన, కీర = చిలుక, మణిబంధా = ముంజేతి మీద ఉన్నదీ,
హృదయబంధౌ = ప్రేమ పాత్రుడైన, భవే = శివుడిపట్ల, అతివ = మిక్కిలి, రసికా =
ప్రేమానురాగాలు కలదీ, అమృతసింధౌ = అమృత సముద్రంలో, ఉదారనిలయా - అపి =
ఉత్తమనివాసం ఉన్నప్పటికీ, భువన = (భక్త) లోకం యొక్క, సంధారణే చిత్తాన్ని
ఈశ్వరాయత్తం చేయటంలో, సంధావతీ = సన్నిహిత సంబంధం కలదీ, గంధ = సుగంధ
పరిమళాల, అనుభావ = ప్రభావంవల్ల, ముహుః = మాటిమాటికీ, అంధ = కళ్లు మూతలుపడిన,
అళి = తుమ్మెదలవల్ల, పీత = పచ్చబడిన, కచబంధా = గొప్ప కొప్పుగలదీ, ధామః =
తేజఃప్రభావం చేత, భానుం - అపి = సూర్యుణ్ణి కూడ, రుంధానం = అడ్డగించేదీ,
ఆశుపద = ఆశుకవితను, సంధానం - అపి = ప్రసాదించటంలో కూడ, అనుగతా = తగిన
పార్వతి, శం = శుభాన్నీ, సామర్థ్యాన్ని, (లేదా, భానుం - అపి = సూర్యుణ్ణి కూడ,
రుంధానం = అడ్డగించే, పద సంధానం = పదగమనాన్ని, అనుగతా = కలిగియున్న
పార్వతీదేవి, మే = నాకు, ఆశు = త్వరగా, శం - అపి = శుభాన్ని కూడా) మే = నాకు,
సమర్పయతు = అనుగ్రహించునుగాక!
 
భావం
 
విశేష పద వ్యాఖ్య
ఇంధానకీర మణిబంధా
 
=
 
రసజ్ఞ అయిన పార్వతీదేవి అందాల రాచిలుకను తన ముంచేతి మీద ధరించి
ముచ్చటలు చెబుతుంది. తన హృదయ బంధువైన పరమేశ్వరుడిపట్ల ఆమెకు అత్యంతానురాగం.
తాను నివసించేది అమృత సరస్సులోనే అయినా, అక్కడ సర్వ సుఖాలతో మునిగితేలుతున్నా
భక్తరక్షణే ఆమెకు పరమధ్యేయం. భక్తుల చిత్రాలను పరమేశ్వరుని పట్ల లగ్నం చేస్తుంది.
పచ్చటి పుప్పొళ్లు తమ శరీరాలకు అంటుకొన్న తుమ్మెదల గుంపులు
వచ్చి వాలటంచేత, సహజ సువాసనలు వెదజల్లే ఆమె కేశపాశం పచ్చగా మారి ప్రకాశిస్తుంది.
సూర్యమండల తేజస్సును సైతం అధఃకరిస్తాయి ఆమె పాదకాంతులు. ఆమెకు గల ఆశుకవితా
శక్తి అమోఘం. దానిని ఆమె నాకు అనుగ్రహించి శుభాన్ని కలిగించుగాక !
 
తిరగటం
 
చిలుకల పలుకులు కమనీయం, వాటి రూపం రమణీయం. చిలుకలు మృదుమధుర
మనోజ్ఞభాషా ప్రతిరూపాలు. శృంగారోద్దీపక కారకాలు. ప్రియంభావుకలైన చిలుకల కొలుకులు