We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
స్త్రీల క్షేమాన్ని సుఖాన్ని కాంక్షించటం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. వారు
శక్తి స్వరూపలని విశ్వాసం. స్త్రీలు రతిదేవిలాగా నిత్య సుమంగళులు కావాలి. పులోమజలాగా
భర్తృ పురోభివృద్ధిని కోరాలి. లోపాముద్రలాగా దేవీ పదోన్నతలు కావాలి. వారు అంతటి ఉన్నతికి
ఎదగాలంటే పార్వతిలాగా పతిభక్తి సంపన్నలు కావాలి. అందుకు ఆమెను స్థూలకుచగా నీలకచగా
పతి ప్రణతి శీలగా ఎంచి ధ్యానించాలి. అలా ధ్యానిస్తే వారి హృదయాలలో ఆమె నివసిస్తుంది.
 
శూలాయుధుడు దుష్ట శిక్షణకు సన్నద్ధుడైనట్లే కవి కూడా నిత్యం తన కవితలతో
సమాజంలోని దుష్టశక్తుల మీద విజృంభించాలి. అది అతని బాధ్యత. కవితా ప్రయోజనమైన
శివేతర క్షతి అంటే అశుభ నివారణ, సమాజపరంగా చాలా ముఖ్యం. కవి ధార్మిక సౌందర్యాన్ని
తన ఆదర్శకాప్యంలో చిత్రించాలి. అలా చేసేదే ఉత్తమ కవిత. అటువంటి కవితలవల్ల ప్రజలు
చైతన్య వంతులైతారు. విభాతు శబ్ద స్వారస్యం ఇదే!
 
39