2023-02-27 21:58:18 by ambuda-bot
This page has not been fully proofread.
డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
శ్లో॥
37
కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా
కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా ।
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధప్రణతి శీలా విభాతు హృది శైలాధి రాజ తనయా ॥ 12
ప్రతిపదార్థం
కూల-అతిగామి = హద్దు మీరిన, మిక్కిలి, భయ-తూల-ఆవళి = భయమనే దూది
రాసులకు, జ్వలన కీలా = అగ్నిశిఖ వంటిదైన, నిజస్తుతి విధా = తనయొక్క స్తోత్ర పద్ధతి
గలదీ, కోలాహల = కష్టాల కలకతో, క్షపిత కాల = కాలం గడిపిన, అమరీ = దేవతా స్త్రీలకు,
కుశలీ = క్షేమమనే, కీలాల = నీటిని, పోషణ = వృద్ధిపరచే, నభా = శ్రావణ మేఘం లాంటిది,
కుచే-స్థూలా = స్తన విషయంలో భారం కలదీ, కచే-జలద నీలా = కురుల విషయంలో
మేఘాలవలె నల్లనైనది, కదంబవిపినే = కడిమి చెట్లతోపులో, కలిత లీలా = విహారం కలదీ,
శూలాయుధ = శూలాన్ని ఆయుధంగా ధరించే శివుడికి, ప్రణతిశీలా = నమస్కరించే మంచి
నడవడి గలదీ అయిన, శైలాధి రాజతనయా = హిమవంతుడి కూతురైన పార్వతి, హృది = నా
హృదయంలో, విభాతు = వెలుగొందు గాక!
భావం
శ్రీదేవీ స్తోత్ర విధాన మహిమ భక్తుల భయాలనే మిక్కిలి పెద్దవైన దూది రాసులను
దహించే భయంకరమైన అగ్నిజ్వాల. దేవతా స్త్రీలకు శుభ పరంపరలనే వర్షాలను వృద్ధిపరచే
శ్రావణ మేఘం. అంటే ఎప్పుడూ వారి యోగక్షేమాల బాధ్యతను తానే వహిస్తుంది. ఘనస్తనాలతో
తెగబారెడు నల్లనికురులతో ఆమె శోభిస్తుంది. ఆమె నిత్యం కదంబవనంలో విహరిస్తుంది.
పరమశివుడి వేషభాషలను విలాసంగా అనుకరిస్తుంది. సదాచార పరాయణ. నిత్యం పరమ
శివుడికి పాదాభివందనం చేస్తుంది. ఆ పర్వత రాజతనయ పార్వతీదేవి నా హృదయంలో
నిలిచి సదా ప్రకాశించును గాక!
విశేష పద వ్యాఖ్య
కూలాతి గామి .....నిజస్తుతి విధా
పార్వతీదేవి స్తుతిప్రియ, స్తోత్రార్హమైన సద్గుణరాశి. ఆమె సర్వాపద్వినివారిణి, భక్తుల
లన్నింటినీ నివారిస్తుంది. భయాల నన్నింటినీ పోగొడుతుంది. తన భక్తుల యొక్క
ఆధివ్యాధులూ భవబంధాలూ జరపమృత్యువులూ కళంకాలూ భయాలు అనే ప్రత్తి కొండలను
దహించే భయంకరమైన అగ్నిజ్వాల. ఆమెకు సంబంధించిన స్తుతివిధాన మహిమ ౦టిది.
ఆమె వహ్నిమండల వాసిని. లోకంలో ఉన్న అగ్నిమండలం లోని దాహకశక్తి ఆమె స్వరూపమే.
ఇందులో అర్చిష్మతీ అగ్నికళలుఅంతర్నిహితంగా ఉన్నాయి. ఆమెకు ఉన్న భయనివారకశక్తి
అత్యద్భుతమైనది.