This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
నిస్తుల శుకా
 
అందమైన చిలుక. చిలుక చెట్టు మీద ఉన్న ఫలాన్ని చూసిన వెంటనే దాన్ని
అనుభవిస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగి తురీయ స్వరూపమైన బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొన్న
వెంటనే తత్స్వరూపుడై అవిద్యా విముక్తు డైతాడు. చిలుకతో కూడిన దేవిని ధ్యానిస్తే ఆమె
తనభక్తులను బ్రహ్మతత్త్వ విదులను చేసి అవిద్యా విముక్తులను చేస్తుంది. కనుక ఆమె చేతిలోని
చిలుక బ్రహ్మతత్త్వానికి సంకేతం.
సుత్రామ కాల ముఖ ......
 
35
 
..... చరణా
 
చండ ముండ భండ మహిషాసురాది రాక్షస బాధలకు తాళజాలని దేవతలూ యముడూ
కూడా పలుసార్లు జగన్మాత పాదాల మీదపడి ప్రార్థించారు. ఆ పరదేవత దైత్యులను సంహరించి
దేవతల భీతిని పోగొట్టి రక్షించింది. ఇలా ఆమె ఎప్పుడూ వారి రక్షణ యాత్రకు అంకితమై
ఉంటుంది. ఆమె దైత్యహంత్రి, దేవకార్య సముద్యత,
 
ఛత్రానిలాతిశయ పత్రా
 
వాయువేగం ఆమె అధివసించిన రధం మీద ఉన్న వెల్ల గొడుగును ముందుకు
నెట్టడం చేత రథవేగం పెరిగిం దనిభావం. దేవీ శ్వేతచ్ఛత్రసౌందర్యం తిలకింపదగింది.
'శరత్ప్రభవ చంద్రమ స్ఫురిత చంద్రికా సుందరం
గళ త్పురతరంగిణీ లలిత మౌక్తికాడంబరం ।
గృహాణ నవకాంచన ప్రభవ దండ ఖండోజ్జ్వలం
 
మహా త్రిపుర సుందరి ప్రకట మాతపత్రం మహత్ ॥ శ్రీశ్రీశ్రీ దుర్గామానసపూజ
మహా త్రిపురసుందరికి సమర్పించిన దివ్య చ్ఛత్రం శరత్కాలపు వెన్నెలలాగా తెల్లనిదీ
కాంతిమంతమైనదీ సుందరమైనది. ఆకాశగంగానదీ ప్రవాహం నుండి ప్రక్కకు జారిపడుతున్న
నీటి బిందువుల్లాంటి ముచ్చటైన ముత్యాలతో ప్రకాశిస్తుంది. సువర్ణ దండంతో దేదీప్యమానమైన
కాంతితో విరాజిల్లుతుంది.
 
***************
 
పుత్రాది దాన నిపుణా
 
దేవిని ఆరాధించటం వల్ల మణి మాణిక్యాల వంటి సంతానం కలుగుతుంది. కోరికలు
ఫలిస్తాయి.
 
వంధ్యానాం పుత్ర లాభాయ, నేను సాహస్ర మంత్రితం !
 
నవనీతం ప్రదద్యాత్తు, పుత్రలాభో భవే ద్రువమ్ ॥
 
లలితా సహస్రనామస్తోత్రం
దేవీ సహస్రనామ పారాయణం చేసి నవనీతాన్ని అభిమంత్రించి ఇస్తే పంధ్యలకు సైతం
తప్పక పుత్రప్రాప్తి కలుగుతుంది.
 
n