This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
3
 
శ్లో॥ యత్రాశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా ।
ఛత్రానిలాతిరయ పత్రాభిరామ గుణ మిత్రామరీ సమ వధూః
కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా ॥ 11
ప్రతిపదార్థం
 
34
 
సుత్రామ = ఇంద్రుడు, కాల = యముడు, ముఖ = మొదలైన, సత్రాసక = భయపడి
ఉన్నవారి, ప్రకర = సమూహాన్ని, సుత్రాణకారి సమర్థంగా రక్షించే, చరణా = పాదాలు
గలదీ, ఛత్ర = గొడుగు యొక్క, అనిల = గాలిచేత, అతిరయ = పెరిగిన వేగంగల, పత్ర =
వాహనం గలదీ, అభిరామగుణ = మనోజ్ఞమైన లక్షణాలు గల, మిత్ర = చెలులైన,
అమరీసమ = దేవతా స్త్రీలతో సమానమైన, వధూః = వనితలు గలదీ, కుత్రాస-హీన =
నింద్యమైన భయంలేని, మణిచిత్రాకృతి = రత్నాల బొమ్మలవంటి, ఆకృతి = ఆకారంగల,
స్ఫురిత = ప్రకాశించే, (కుత్రాస = చెడ్డదైన భయాన్ని, హన్ = ధ్వంసంచేసే, మణి =
ఉత్తములైన, విచిత్రాకృతి = చిత్రమైన స్వరూపంతో, స్ఫురిత = ముద్దులొలికే) పుత్ర+ఆది =
పుత్రాది = పుత్ర సంతానాన్నీ, ఇంకా ఇతర సంపదలను, దాన నిపుణా = ప్రసాదించటంలో
సామర్ధ్యం గలదీ, అయిన, నిస్తుల = సాటిలేని, అందమైన, శుకా - చిలుకతోకూడిన, అగజ =
పార్వతీదేవి, యత్ర = ఎచ్చటైతే, ఆశయః = ఆమె హృదయం, లగతి = గమైతున్నదో,
తత్ర = అక్కడ, కుత్ర+అపి = కుత్రాపి = మరెక్కడైనా, వసతు = ఉండుగాక!
 
భావం
 
=
 
గిరిజా పాదసేవ ఇంద్రాది దిక్పాలకు లందరి భయాందోళనలను ఇట్టే పోగొడుతుంది.
వారి రక్షణ భారాన్ని సర్వాన్నీ సదా ఆమె వహిస్తుంది. ఆమె వహించిన గొడుగు వాయువేగం
వల్ల ముందుకు తోస్తుంటే, ఆమె అధివసించిన రథవేగం అధికాధిక మైతుంది. ఆమెకు మనోహర
మైన విలాసవతులూ దేవతా స్త్రీలతో సమానమైన వారూ ఐన చెలికత్తె లెందరో ఉన్నారు.
నిర్భయులూ తేజశ్శాలురూ అయిన రత్నాలవంటి పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తుంది. మరెన్నో
సంపదలను ప్రసాదిస్తుంది. చక్కని రాచిలుకను ధరించిన దేవీ రూపాన్ని ధ్యానించిన భక్తుల
హృదయాలలో ఆమె అధివసించు గాక!
 
విశేష పద వ్యాఖ్య
 
యత్రాశయోలగతి తత్రాగజా భవతు
 
ధ్యాన గమ్య, భక్తుడికి ధ్యానయోగం వల్ల దర్శన మిస్తుంది. మంత్ర
భావన చేత భక్తుడి యొక్క ఆత్మ శక్తిమంత మైతుంది. భక్తి కలిగి దేవతారూపాన్ని ధ్యానించటమే
చిత్తవృత్తి. అదే భావన. ఏ భక్తులు అగజా స్వరూప దర్శన ఆశయంతో ఇలా గాఢంగా భావిస్తారో
వారి హృదయాలలో ఆమె సదా నివసిస్తుంది.