This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
పద్మరాగమణులు ఉద్భవిస్తాయి. ఆ మణులతో దేవీ మకుటం ప్రకాశిస్తుంది. వాయువు భక్తి
ప్రపత్తులతో ఆ కిరీటానికి మందారాది దేవతా సుమాలను కూర్చి, అలంకరించి సువాసనలు
సమకూర్చుతాడు. ఇలా మణిగణాలకు మందారాలు తోడై ఆ కిరీటం మనోహరంగా భాసిల్లుతుంది.
పార్వతీ దేవి ధరించిన సువర్ణ కిరీటం ద్వాదశాదిత్యులనే మహామణులతో కూర్చబడిందనీ
తలమిది నెలవంక రత్నఖచితమై అనేక రంగులతో ప్రకాశించే ఇంద్ర ధనుస్సును తలపిస్తుందనీ
ఆదిశంకరులు భావించారు.
 
33
 
గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ।
స నీడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చంద్ర శకలం
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ॥
సౌందర్యలహరి
ఉషః కాలంలోని గగన ప్రకృతే దేవీ కిరీటం. కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధిలో కలిగే
ఉషఃకాల సంబంధమైనది ఈ చిత్రణం. కృష్ణచతుర్దశి భగవతీ ఉపాసనకు తగిన సమయం.
కార్తిక కృష్ణ చతుర్దశి అయితే సాక్షాత్తు భగవతీ స్వరూపమే కదా!. కనుకనే దానికి రూప చతుర్దశి
అని వ్యవహారం.
 
అరవిందాసనా
 
అరవిందం = కేసరాలను కలిగి ఉండేది. కేసరాలున్న పూలలోనే మకరందం ఉంటుంది.
వాటికే పూజార్హత. దేవి అరవిందాసన, పద్మాసన. ధర్మమే పద్మం, పద్మ మూలం జ్ఞానం. కర్ణిక
వైరాగ్యం. సాధకుడు ఈ ధర్మ జ్ఞాన వైరాగ్యాలను దీక్షతో భక్తి శ్రద్ధలతో అనుష్ఠించాలి. అలా
చేస్తే ఆ దేవి తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
 
విశేషాలు
 
మకరందాభిషిక్త చరణ అని కాళిదాసు భావించాడు. శంకరాచార్యులు మరికొంత
ముందుకు వెళ్ళి దేవీ పాదోదకం పుట్టు మూగలను సైతం మహాకవితా పట్టభద్రుల్ని చేస్తుందని
సౌందర్యలహరిలోని కదాకాలే మాతః అనే శ్లోకంలో పేర్కొన్నాడు. ఆ కవిత్వం సరస్వతీ తాంబూల
రసం లాగా రంజకంగా కూడా ఉంటుందని జగద్గురువుల అభిభాషణం.
 
కుంద నైర్మల్యం అరవింద మరంద మాధుర్యం మందారాల మకరందం మార్దవం
సౌరభం, మందాకినీ వక్ర గమనంలోని సౌందర్యం పవిత్రత కవితలో ఉండాలని కవి భావన.
గంగా స్రవంతి లాంటి కవిత తనకు కావాలని కవి కోరిక. కవిత పవిత్ర మైన దనీ వక్రత దాని
అందక్కిస్తుందనీ సూచన. శ్రీనాథుడు హరచూడాహరిణాంక వక్రత అని వక్రతను
హరవిలాస పీఠికలో సంభావించాడు.