2023-02-27 21:58:16 by ambuda-bot
This page has not been fully proofread.
దేవీఅశ్వధాటి
శ్లో॥ వందారు లోక వర సందాయినీ విమల కుందావదాత రదనా
బృందారబృంద మణిబృం దారవింద మకరందాభిషిక్త చరణా ।
మందానిలా కలిత మందారదామభి రమందాభిరామ మకుటా
మందాకినీ జవన భిందాన వాచ మరవిందాసనా దిశతు మే ॥ 10
ప్రతిపదార్థం
32
వందారు లోక = నమస్కరించే భక్త జనానికి, వరసందాయినీ = వరాల నిచ్చేదీ,
విమల కుంద = నిర్మలమైన బొండు మల్లెల వంటి, అవదాత = తెల్లటి, రదనా = పలువరుస
గలదీ, బృందార-బృంద = దేవతా సమూహపు, మణిబృంద = (కిరీటాలలోని) రత్న సమూహంతో
ఉన్న, అరవింద = పద్మాలలోని, మకరంద = పూదేనెలతో, అభిషిక్త చరణా = అభిషేకించబడిన
పాదాలు గలదీ, మందానిల = పిల్ల గాలుల చేత, ఆకలిత = చక్కగా కూర్చిన, మందార =
మందార పూల, దామభిః = మాలికలతో, అమంద = మిక్కిలి, అభిరామ = మనోహరమైన,
మకుటా = కిరీటం గలదీ, అయిన, అరవిందాసనా = పద్మం ఆసనంగా గలదీ అయిన
జగన్మాత, మందాకినీ = ఆకాశ గంగానది యొక్క, జవన = వేగాన్ని, భిందాన = అతిగమించే,
వాచం = వాక్కును, మే = నాకు, దిశతు = ఇచ్చు గాక!
భావం
ఆమె పద్మాసన. వందనం చేస్తే చాలు ఆ దేవి వరాలు కురిపిస్తుంది. మల్లె మొగ్గ
ల్లాంటి చక్కనైన పలువరుసతో ఆమె మెరిసిపోతుంది. పద్మాలను అలంకరించుకున్న మణి
కిరీటాలతో దేవతలు శిరసులు వంచి నమస్కరిస్తుంటే ఆ పద్మాలలో నుండి జాలువారే మకరంద
ధారలతో ఆమెకు పాదాభిషేకం జరుగుతుంది. ఆమె ధరించిన మణి కిరీటాన్ని మందానిలుడు
మందారాలతో ముంచెత్తి మరీ మరీ మనోజ్ఞంగా చేస్తాడు. పవిత్రమైన గంగా ప్రవాహ వేగాన్ని
మించిన వాగ్ధాటిని ఆ జగన్మాత నాకు ప్రసాదించు గాక !
విశేష పద వ్యాఖ్య
మందానిలాకలిత.
.మకుటా
మందానిలం = శైత్య మాంద్య మాధుర్యాలనే మూడు లక్షణాలు కలది.
మందార = ఇంద్రుడి నందన వనంలోని దేవతావృక్షా లైదింటిలోనూ ఇది ఒకటి.
పంచైతే దేవ తరవో, మందారః పారిజాతకః ।
సంతానః కల్పవృక్షశ్చ, పుంసివా హరిచందనం ॥
మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం
పార్వతీదేవి మందార కుసుమ ప్రియగా పేరు గాంచింది.
వీటి పూలు లోక ప్రసిద్ధాలు.
ఆమె కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండిత - కురువింద శిలలు ఎర్రటి
కాంతులతోనూ కామం అనురాగం వంటి సుగుణాలతోనూ శోభిస్తాయి. వాటిలో నుండి