This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
కలిగి ఉండటం. ఆమె ఏకాగ్ర చిత్తంతో భక్తులకు విజయాన్నీ జ్ఞానాన్నీ ముక్తినీ కలిగిస్తుంది.
ఆమె సర్వ శత్రు సంహారిణి. సర్వత్ర విజయాన్ని సాధించే విజయ.
 
జయలక్ష్మి + అవధాన + కలనా. అవదానం = జరిగిన మంచి చరిత్ర. దీని వల్ల నరుడు
పునీతు డౌతాడు.
 
31
 
అపదానం = కర్మవృత్తం, పూర్వమందైన పవిత్ర వ్యాపారం, మంచి నడవడి - మంచిపని.
ఆ అద్భుత చారిత్ర. జయస్వరూపురాలు. భయంకరమైన రాక్షసులను సంహరించిన
అనేక సంకేతాలు గలది. ఇలా సుప్రసిద్ధమైన వీరకృత్యాలకు సంబంధించినది ఆమె చరిత్ర.
 
విశేషాలు
 
కవికి కఠోరదీక్ష అవసరం. కవిత మనోహర గుణ కలిత కావాలి. భిక్షాళి లాగా కవి
కవితా మకరంద మాధుర్యాన్ని పొందు పరచాలి. వినోదముఖి శబ్దం వల్ల కవిత ఆనంద ప్రదంగా
వుండాలని సూచన. ఉత్తమ కవికి నిరాక్షేప శక్తి ఉంటుంది. అదే ప్రతిభ. దాని వల్ల కవిత
నవనవోన్మేషశాలిని అవుతుంది. దేవి స్వకీయులైన భక్త కవుల పక్షాన నిలిచి వారికి జయలక్ష్మినీ
ఏకాగ్రతనూ ప్రసాదించమని కవి అభ్యర్ధన. వినోదముఖీ శబ్దం వల్ల కవి జగద్వ్యాపారాన్ని
రసహృదయంతో తిలకించాలే తప్ప, ఆ ప్రపంచ వ్యవహారంలోకి దిగరాదనీ ఊరక చూచి
ఆనందించాలనీ భావం. పార్వతి దృష్టి లాగే కవిత కూడా వివిధ రసభరితం కావాలని వీక్షా శబ్ద
స్వారస్యం . అటువంటి కవితా శక్తిని తనకు ప్రసాదించమని కాళిదాస కవి అభ్యర్ధన. అందుకు
దక్షతనయ దక్షురాలని భావం.