We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

30
 
దేవీ అశ్వధాటి
 
భిక్షాళినో నటన వీక్షా వినోద ముఖి (పాఠాంతరం)
 
భిక్షాళినః = అందమైన ఆమె ముఖ పద్మంలోని మకరంద భిక్ష కోసం వచ్చిన తుమ్మెదలు,
నటన వీక్షావినోద ముఖీ = వాట్యాన్ని చూచినప్పుడు ఆమె ముఖం ఎంతో అందంగా ఉంటుంది.
ఆమె ముఖాన్ని చూచి పద్మంగా భ్రాంతి చెంది తుమ్మెదలు వచ్చి చేరతాయి. వాటి
అమాయకత్వానికీ, వాటి భ్రమణ రీతికీ ఆమె వినోదిస్తుంది. లోకవత్ లీలా కైవల్యం అని
బ్రహ్మసూత్రాలలో చెప్పినట్లు ప్రపంచ సృష్టి పరమేశ్వర లీలా విలాసం. ఆ వినోదాన్ని తిలకిస్తుంది
రసజ్ఞ అయిన ఆ దేవి.
 
దక్షాధ్వర ప్రహరణా
 
ఆమె దక్షయజ్ఞ వినాశిని. దక్షయజ్ఞం అహంకారానికి శివనిరాసనకూ ప్రతీక. దానిని
ఆమె నాశనం చేసింది. ఆమె ఆరాధకులలో శివనింద ద్యోతక మైతే వారిని శిక్షిస్తుంది. సన్మార్గంలో
పెడుతుంది. అందుకు దక్షుడే సాక్షి.
 
స్వకీయ జన పక్షా
 
ఆమె భక్త ప్రియ, భక్తి వశ్య. భక్తి చేత మాత్రమే స్వాధీన మైతుంది. భక్తులందరి పట్ల
సమాన మైన ప్రేమను ప్రకటిస్తుంది. సకల సంపదలిచ్చి రక్షిస్తుంది. భక్త మానస హంసిక.
వారికి సాయుజ్య ముక్తి నిస్తుంది. వారే ఆమెకు స్వకీయులు. వారిని సర్వవిధాలా సంరక్షిస్తుంది.
విపక్ష విముఖీ
 
తన భక్తులకు వ్యతిరేకులే ఆమెకు విపక్షులు-శత్రువులు. వారిలో శుంభ నిశుంభాది
రాక్షసులు ముఖ్యులు. వారిని ఆమె సమూలంగా సంహరించింది.
యక్షేశ సేవిత
 
యక్షులకు అధిపతి, సంపదలిచ్చే పుణ్యజనేశ్వరుడు రాజరాజు, అతడే కుబేరుడు.
పార్వతీదేవిని నిత్యం కుబేరుడు అర్చిస్తాడు. అందుచేత ఆమె రాజరాజార్చితగా ప్రసిద్ధి చెందింది.
ఈ కారణం చేత సర్వసంపదలూ శక్తులూ ఆమె అధీనంలోనే ఉంటాయి. కనుకనే జనులందరి
చేత ఆమె నిత్యం పూజలందుకుంటుంది.
 
నిరాక్షేపశక్తి
 
శ్రీవిద్య పంచదశీమంత్ర స్వరూపం. అందులోని నాలుగు బీజాలు గల శక్తి కూటాన్ని
లలితాదేవి తన అధఃకాయంలో ధరించి ఉంటుంది. శ్రీచక్రంలోని అణిమాది భగమాలినీ
పర్యంతమైన శక్తి సముదాయమూ బాలా శ్యామలా మొదలైన సర్వ శక్తులూ సర్వ మంత్రాలలోని
శక్తిబీజాలూ అన్నీ ఆమె స్వరూపాలే! ఆమె సర్వశక్తిమయి. సర్వప్రాణులలోని జీవకళే
ప్రకాశరూపమైన శక్తి. అజ్ఞానాన్ని పోగొట్టేదీ జ్ఞానమే ప్రధాన మైనదీ అయిన చిచ్ఛక్తి ఆమె. ఆ పై
'పరాశక్తి మహాశక్తి అన్నీ ఆమే! కనుకనే ఆమె శక్తిని అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదు.
 
జయలక్ష్మ్యావధానకలనా
 
జయలక్ష్మి. + అవధాన + కలనా. అవధాన = నిశ్చలత్వం, ఏకాగ్రత. కలనా = ధరించటం,