We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
శ్లో॥ దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా
భిక్షాశినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రహరణా ॥
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్ష్మ్యావధాన కలనా ॥ 9
ప్రతిపదార్థం
 
28
 
దనుజశిక్షావిధౌ = రాక్షస సంహార విషయంలో, వికృతదీక్షా = అసాధారణమైన పట్టుదల
గలదీ, మనోహర గుణా = సునసు కంపైనగుణ సంపదకలదీ, భిక్షాశినః = శివుడి, నటన
వీక్షా = తాండవాన్ని తిలకించటంలో, వినోద ముఖీ = ఆనందించే ముఖం కలదీ, దక్షాధ్వర
ప్రహరణా = దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసిందీ, దక్షా = సమర్ధురాలు, స్వకీయజన పక్షా =
తనభక్తులకు అండగా నిలిచేదీ, విపక్ష విముఖీ = శత్రువులకు ప్రతికూల మైనదీ, యక్షేశ
సేవిత = కుబేరుడి చేత సేవింప బడేది, నిరాక్షేప శక్తి = ఎదుర్కొనటానికి వీలు కాని శక్తి గలదీ,
జయలక్ష్మీ = విజయలక్ష్మిని పొందటంలో, అవధాన = ఏకాగ్రత, కలనా = కలదీ, (లేదా,
జయలక్ష్మ = విజయానికి గుర్తులైన, అవదాన = ప్రశస్తమైన, పూర్వచరిత్ర, కలనా = కలదీ)
అయిన, దాక్షాయణీ = దక్షప్రజాపతి కూతురైన పార్వతి, మయి = నా పట్ల, వీక్షాం = దృష్టిని,
విధేహి = ఉంచవలసింది.
 
భావం
 
శ్రీదేవికి గల విశేషమైన ఏకైక దీక్ష నిత్య రాక్షస సంహారమే! ఆమె అరి వీర భయంకరి.
శివాపరాధం చేసిన వారిని ఎవరినీ ఆమె ససేమిరా క్షమించదు. చివరకు తన తండ్రి అయిన
దక్షుడి యజ్ఞాన్ని సైతం ధ్వంసం చేసింది. గతంలో అనేక విజయ పరంపరలను సాధించిన
సర్వ సమర్ధ. విజయ సాధనలో ఆమెకు ఏకాగ్రత మెండు. నిత్యం శివతాండవాన్ని తిలకిస్తూ
సంతసిస్తుంది. ఉత్తమ గుణవతి. కుబేరుడు ఆమెను నిత్యం భక్తితో అర్చిస్తాడు. ఆమె భక్తుల
పాలిటి కొంగు బంగారం. ఆ దాక్షాయణీదేవి నా పట్ల అనుగ్రహ దృష్టిని ప్రసాదించు గాక!
విశేష పద వ్యాఖ్య
 
దాక్షాయణి
 
దక్షప్రజాపతి చేసిన ఉపాసనారీతికి మెచ్చి పార్వతి అతడికి కుమార్తెగా అవతరించింది.
కనుక ఆమె దాక్షాయణి.
 
దనుజ శిక్షా విధౌవికృత దీక్షా
 
భండాసుర శుంభాసురు లనేకులను శస్త్ర ప్రత్యస్త్రాలతో నశింపచేసింది. భయంకరు
లైన రాక్షసులను అలా సంహరించటం ఆమెకు దీక్ష. అదే విధంగా భక్తుడి లోని దనుజ లక్షణా
లైన కామ క్రోధాదుల్ని నశింపచేయడానికి దీక్ష వహిస్తుంది. అలా చేసి భగవంతుడికీ భక్తుడికీ
అభేదం కల్పిస్తుంది.