This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
ఆభరణాల అలంకరణ ఒక సౌందర్య కళ. ఇలా కళాదృష్టి లేని ఆభరణధారణ వృథా.
ఆభరణాలు భర్తృ ఫలాభివృద్ధిదాలు కావాలి. అసలు ఆభరణ రచన మగని మనసును
దోచుకోవటానికి దోహద పడాలి. అది ప్రకాశవంతంగానూ నయనానందకరంగానూ ఉండే మంగళా
భరణాలైతే మరీ మంచిది. లోకంలో కొన్ని ఆభరణాలకు పూజార్హతే గాని ధారణార్హత లేదు.
కానీ కామ కల్పోక్తమైన చతుష్షష్టి ఉపచారాలలోని మహాపతక చ్ఛన్న వీరాది ఆభరణాలను
అమ్మవారు నఖశిఖ పర్యంతం కళాత్మకంగా అలంకరించు కొన్నది. ఇలా ఆమె సర్వా భరణ
భూషితగా దివ్య భూషణ సందోహ రంజితగా వినుతి కెక్కింది.
 
శం-సదా-ఆదిశతు-మే
 
26
 
శం = శుభం, శ్రేయస్సు, శాస్త్రం, కీర్తి, స్వర్గం, శివుడు, దేవపూజ, శక్తి, వృద్ధి, హృద్యం,
శాంతం, సంతోషం, సుందరం మొదలైనవి.
 
సత్+ఆదిశతు = అని విభజిస్తే సత్ సత్యే సాదౌ విద్యమానే ప్రశస్తే భ్యర్దిచ సత్ సత్యం,
సాధువు, కలిగి ఉండటం, శ్రేష్ఠం మొదలైనవి.
 
సత్ అనేది సద్రూపమైన పరమాత్మ. అది త్రికాలాబాధ్యమైన బ్రహ్మలక్షణం. సచ్చిదానంద
నిత్య పరిపూర్ణ పాఖ్యం పంచలక్షణం బ్రహ్మ విద్యాత్ అని అద్వైతామృతో పనిషత్ వ్యాఖ్య.
దీనిని బట్టి నత్తు చిత్తు ఆనందం నిత్యం పరిపూర్ణం అనే వాటితో పరబ్రహ్మం
కీర్తింపబడుతుంది.నితాంత సచ్చిదానంద సంయుక్తంగా ఉంటుంది. కనుక ఈ గుణాలనే స్మరిస్తూ
పరమాత్మను దర్శించాలి. అలా చేయటం వలన ఆ లక్షణాలు గల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది..
ఆదిశతు - ఉపదిశతు - ఉపదేశించుగాక!
 
పైన చెప్పిన పద్ధతిలో తనకు పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తుని ఆకాంక్ష.
శుంభాసుర ప్రహరణా
 
శుంభ నిశుంభులు పరమ శివుడి కారుణ్యంతో మగవారివల్ల మరణం లేకుండా వరాన్ని
పొంది దేవతలను హింసించసాగారు. అందుచేత వారిని సంహరించటానికి గౌరీ శరీరం నుండి
అపురూప సౌందర్యవతిగా కౌశిక జన్మించింది. ఆమెను పరిణయ మాడాలని శుంభనిశుంభులు
దూతలను పంపారు. కానీ ఆమె తనను జయించిన వారిని మాత్రమే వివాహమాడుతానని
వారితో చెప్పి పంపించింది. ఆపై ఆమెను బలాత్కారంగా తీసుకొనిపోవటానికి వచ్చిన చండ
ముండులనూ ధూమ్రలోచనుడినీ రక్తబీజుడినీ తక్కిన దనుజులందరినీ సంహరించింది. తర్వాత
దేవి వారిద్దరినీ కూడా సంహరించింది. ఇది ధర్మ బద్ధం కాని కామానికి వ్యతిరేకంగా ఆమె
చేసిన యుద్ధం.
విశేషాలు
 
ఇందులోని పార్వతీ దేవి శృంగారాధి దేవత. లోకంలో ప్రతి శృంగార మూర్తికి అనురాగం
అలంకార ప్రీతి అధికంగా ఉంటాయి. అవి రెండూ పార్వతికి సహజ సంపదలే. కుచ సంభావ్య
హారలతికా ప్రయోగం వల్ల అలంకారాలు సహజ సౌందర్యానికి శోభనిచ్చేవిగా ఉండాలని,