This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
కూడా. దేవి స్థూల ముక్తా ఫలోదార సుహార. ఆమె ముత్యాల హారాల కోసం ముచ్చట పడుతుంది.
కనుకనే శివుడు గజాసురుడిని సంహరించి అతడి శిరస్సునుండి రాలి పడిన ముత్యాల మొత్తాలను
ఏరి హారంగా కూర్చి పార్వతీ గళసీమ నలంకరించాడు (శ్లో॥ వహత్యంబ....... సౌందర్యలహరి)
 
25
 
మత్తేభాల కుంభ స్థలాలు ముత్యాల నిధులని కవి సమయం. ఇక ఐరావతం ఉన్నత
కుంభ స్థలాలకూ తెల్లదనానికీ ప్రసిద్ధి. దాని కుంభ స్థలాల యొక్క నిధిత్వ పృథుత్వాలను
సైతం అపహసిస్తాయి దేవీ కుచ కుంభాలు. ఆ స్తనాల చేత గౌరవింపబడుతుంది ఆమె
ధరించిన ముత్యాల హారం. ఇక్కడ స్తనాలూ హారాలూ రెండూ పరస్పర సౌందర్య పోషకాలు.
ఆ హారాల వల్ల ఆమెకు కలిగిన శోభ వాగతీత మయిందీ ఊహించుకో వలసింది మాత్రమే.
రంభా కరీంద్ర ------ గతిః
 
గిరిజాదేవి ఊరువులకున్న గుండ్రన వెచ్చన బరువు నునుపు అనే నాల్గు లక్షణాలూ
అటు అరటి బోదెలకు గానీ ఇటు ఏనుగు తొండాలకుగానీ పూర్తిగా లేవు- రెండేసి మాత్రమే
ఉన్నాయి. నునుపు గుండ్రన అరటి బోదెకు ఉన్నా దాని ఆకారం తల క్రిందులై శైత్యాన్ని
వహిస్తుంది. ఇక వెచ్చన బరువు అనేవి కరి కరానికి ఉన్నా అది గరుకు దేలి ఉంటుంది. అరటి
బోదెలోని చల్లదనం కరికరంలోని కరుకుదనం రెండూ అనుభవ యోగ్యమైన లక్షణాలు కావు.
కనుక ఆ రెండింటిలో ఏదీ ఆమె ఊరువులతో సాటిరాదు. సల్లక్షణాలన్నీ సమష్టిగాగల పార్వతీదేవి
సుందరతర వనిత. ఆ దేవి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. సౌభాగ్య మార్దవ
లక్షణాలుగల ఆమె ఊరు సౌందర్యం శివుడికి అత్యానందాన్ని కలిగిస్తుంది.
 
డింభాను రంజిత పదా
 
సుకుమారి అయిన ఆమె పాదాలు పసిపిల్లల పాదాల లాగా ఎర్రగా వుంటాయి. ఇది
మంగళప్రదమూ మనోహరమూ కూడా. పార్వతీ దేవి తనపాదాలను ఆశ్రయించిన బాలురవంటి
తన భక్తుల బాధలను తొలగించే అనురాగ రంజని. ఆమె పాదాల పారాణి కాంతులు శ్రీ
మహావిష్ణువు ధరించిన శిరోభూషణపు మణి కాంతులుగా శ్రీ ఆదిశంకరులు భావించారు..
శంభా వుదార ...... పిశునా
 
ఉదార పరిరంభ = సర్వాంగీణ పరిష్వంగం. ఇది గాఢాను రాగ ప్రకటన విధానం. దేవి
మహాదేవ రతౌత్సుక్య. శివుడి తోడి రతి క్రీడతో ఆమె ఆనందిస్తుంది. ఆమె రమణలంపట,
కామకేళీ తరంగిత, శృంగారరస సంపూర్ణ. శివుడితోడి క్రీడా విశేష పరం పరగలది. ఆది
దంపతులైన పార్వతీపరమేశ్వరులు ప్రణయానురాగం రాగ జీవులకు ఆదర్శ ప్రాయం. నిత్య
శుచిమతం వారి అన్యోన్య దాంపత్యానికి ఆలంబనమై ఆమె శంభుమోహినిగా గణుతి కెక్కింది.
భాసురాభరణ గుంఫా
 
గుంఫా = కూర్పు, రచన. సంస్కృతంలో గుంఫ శబ్దమే కాని గుంభ శబ్దం లేదు. కానీ
ఈ శ్లోకంలో గుంభ శబ్దం పాఠాంతరంగా వుంది. ఈ పాఠాంతరాన్ని తెలుగులో ఒక్క కవి
మాత్రమే ప్రయోగించినట్లు సూర్య రాయాంధ్ర నిఘంటువు పేర్కొన్నది.