This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
గిరిజా
 
23
 
గిరేర్జాతా గిరిజా = పార్వతి. మల్లెతీగ' అని అర్థాంతరం. గిరిజన్యాలైన గైరికాది
ధాతువులనూ గిరిజా శబ్దం సూచిస్తుంది. గైరికాది ధాతువులలోని రాగరంజనం, మల్లెతీగలలోని
నవలావణ్యం సౌకుమార్యం గిరిజా శబ్దంలో ధ్వనిస్తాయి. గిరిజాదేవిని ప్రార్ధిస్తే కవిత్వానికి
ఔజ్జ్వల్యం, సౌకుమార్యం, లావణ్యం కలుగుతాయని ధ్వని. దానితో భక్తుడికి అమరత్వం
సహృదయుడికి పరవశత్వం కలుగుతాయి.
 
విశేషాలు
 
దేవీ సౌందర్యవర్ణనం మాతృభావ పరిపూరితంగా, ఆపాదమస్తకంగా విలోమ విధానంలో
సాగాలని ఈ శ్లోక రచనాక్రమం సూచిస్తుంది. ఇక భగవత్తత్త్వాన్ని బోధించని కవిత కవిత కాదు.
అందువల్ల ఉత్తమ కవితా సిద్ధికి గిరిజాదేవీ కృపకావాలి.