This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే
 
త్వం కామనా మయసి కిం కారణం హృదయ! పంకారి మే హి గిరిజారా 4-
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
 
ఝంకారి భృంగతతి మంకా నుపేత శశి సంకాశ వక్త్ర కమలాం ॥ 7
ప్రతిపదార్థం
 
=
 
హృదయ ! = ఓ హృదయమా!, ని+అంక+ఆకరే = న్యం కాకరే = అనేక నిందలకూ
కళంకాలకూ నిలయ మైనదీ, కంకాళ = అస్థిపంజరాన్నీ, రక్త = రక్తాన్నీ, పుషి = పోషించేదీ,
కంక+ఆది+పక్షి = కంకాది పక్షి = రాపులుగులు వంటి అనేక పక్షులకు, విషయే = ఆధారమైందీ,
అయిన, వపుషి = శరీర విషయంలో, త్వం నీవు, కామనాం = కోరికను, అయసి =
పొందుతున్నావు, కిం కారణం = కారణ మేమిటి ?, పంక+అరిం = పంకారం = పాపాలకు
శత్రువైనదీ, శంకా-శిలా = అనుమానాలనే రాళ్లకు, నిశిత = కరుకైన, టంకాయమాన = కాశఉలుల
వంటివైన, పద = పాదాల మీద, సంకాశమాన = బాగా ప్రకాశిస్తున్న, సుమనో = దేవతలనే,
ఝంకారి = రొద చేస్తున్న, భృంగ తతిం = తమ్మెదల సమూహం కలదీ, అంక = కళంకంతో,
అనుపేత = కూడుకొనని, శశిసంకాశ = చంద్రుడివంటి, వక్త్రకమలాం = ముఖ పద్మంకల,
గిరిజాం = పార్వతీ దేవిని, ఏహి = పొందవలసింది.
 
భావ
 
ఓ హృదయమా! ఈ శరీరం రకరకాల రోగాలకూ కళంకాలకు నిలయం. అంతేకాదు
ఇది జుగుప్సాకరమైన రక్త మాంసాలతో కూడిన ఎముకలగూడు మాత్రమే. చివరకు కాక ఘూకాలు
పీక్కు తింటానికి మాత్రమే పనికివస్తుంది. అటువంటి పనికిమాలిన దేహం మీద నీకెందు
కింత మోహం? ఆ దేవీ పాదపద్మాలు భవ బంధాలకు ప్రతి బంధకాలు. ఇహపర సుఖాలకు
కాణాచులు. సంశయాలనే పాషాణాలను పగులగొట్టడంలో అవి పదునైన కాశఉలులే. దేవతలనే
తుమ్మెదలు నిత్యం ఆమె పాదపద్మాలను ఆశ్రయించి తరిస్తాయి. చంద్రునిలాగా ఆమె ముఖశోభ
మనోహరంగా వుంటుంది. కనుక ఆ గిరిజాదేవిని ధ్యానిస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది,
భవబంధాలు తొలగి పోతాయి. మోక్షం కలుగుతుంది.
 
విశేష పద వ్యాఖ్య
 
న్యంకాకరే వపుషి----వక్షి విషయే
 
పూర్వ జన్మ కర్మల ఫలితంగా ప్రస్తుత జన్మ సిద్ధిస్తుంది. పునర్జన్మ లేకుండా మోక్షాన్ని
పొందటానికి ఈ దేహాన్ని నంగా మాత్రమే పోషించు కోవాలి. శరీర పోషణ మాత్రమే జీవిత పరమావధి
కారాదు. ఎందుకంటే ప్రాణ త్యాగానంతరం ఈ దేహం పక్షులపాలు కావలసిందే! కాకుంటే కట్టెలపాలు.
కానీ వెంటరాదు. దేనికీ పనికిరాదు. వెంటవచ్చేదీ పనికివచ్చేదీ పరమాత్మ సంబంధమైన జ్ఞానం మాత్రమే.
జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. అందువల్లనే ఈ దేహంమీద ఏ మాత్రం భ్రాంతి పనికిరాదు.