This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
ఆమె మోక్షమనే బ్రహ్మ పదవిని స్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక శివ. ఇక ఆమె
సర్వమంగళ, సర్వ సల్లక్షణ సంపన్న కనుక శివ. శివ అంటే ముక్తి స్వరూపం. మోక్షే భద్రే
సుఖే శివం అని అమరం లోని వివరణం. తస్మిం సజ్జనే భేదా భావాత్ అనే నారదభక్తి
సూత్రాన్ని అనుసరించి ఆమెకూ ఆమె భక్తులకు భేదం లేదు. అందుచేత కవి కాళిదాసు
తనకు కూడా శివా లక్షణాలు అన్నింటినీ కల్పించి శుభాన్ని కూర్చమని అర్థించాడు.
తిమిర మాసాదయేత్
 
20
 
దేవి అజ్ఞాన ధ్వాంత దీపిక, తమోపహ, జ్ఞానద. తన భక్తుల అజ్ఞా నాంధకారాన్ని
పోగొట్టి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విజ్ఞాన తేజస్సును ప్రసరింప చేస్తుంది. భక్తుల
హృదయాలను ఆర్ద్ర పరుస్తుంది.
 
ఉపరతి
 
ఉపేక్ష, ఇంద్రియాలను విషయాల నుండి మరల్చటం. భేద జ్ఞానంగల ఇతర
దేవతోపాసనలు ఐహిక మాత్ర ఫలాన్నే ఇస్తాయి. అంటే అద్వైత భావంతో కూడిన కర్మాచరణం
కేవలం జ్ఞాన సిద్ధినే కల్గిస్తుంది. కాని శివ పట్ల బుద్ధిని ప్రసరింపచేస్తే అజ్ఞానాన్ని పారద్రోలి
బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ధ్యానంవల్ల భక్తుడు తన బుద్ధిని విషయ సుఖాలనుండి
మళ్లించి నిస్సంగుడైతాడు. అందు చేత అన్యదేవతోపాసనా భావాన్ని మానిపించి తన అజ్ఞానాన్ని
నశింప చేయమని అభ్యర్థన.
 
విశేషాలు
 
ఈ శ్లోకంలోని సుమహాసా, రాసా (కోలాహలం, ఆనందం) సూనతతి భాసా, నాసామణి
ప్రవర భాసా వంటి శబ్దాలన్నీ శ్వేతవర్ణ సంకేతాలే. ఆ దేవి శుక్ల సంస్థిత - శుక్ల ధాతువులో
జీవరూపంగా ఉంటుంది. ఆమె శుక్లవర్ణ, తెల్లగా ఉంటుంది. కోమలాంగి, తేజోవతి, సూర్యాగ్ని
చంద్రులకు సైతం ఆమె తేజస్సే ఆధారం. ఆమె చంద్రమండల మధ్యస్థ, శుద్ధమానస, ఆమె
మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆమె శాంత. ఆమెలాగా నిర్మల మనస్కులైన భక్తులు దేవీ
స్వరూపులైతారు. ఆ శివ జ్యోతిర్మూర్తిగా భాసించి భక్తుల అజ్ఞానాంధకారాన్ని తరిమి కొడుతుంది.
ఇవి అన్నీ దేవీ గుణ సౌందర్య లక్షణాలే.