This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
19
 
కుసుంభ సుమనోవాసా
 
కుసుంభం = కుంకుమ పువ్వు. ఇది కాశ్మీర దేశంలో అధికంగా లభిస్తుంది. దేవతా
పూజా ద్రవ్యంగానూ సుగంధ ద్రవ్య విశేషంగానూ మంగళ ద్రవ్యంగానూ దీనికి వినియోగం
మెండు. ఎరుపును మించిన పనుపు వన్నెగా ఉండే ఈ పుష్పంలో నివసించటం శ్రీదేవికి
మిక్కిలి ప్రీతి.
 
విధూత మధుమాసారవింద మధురా
 
ఆమె స్వరూప స్వభావాలు అరవిందంలోని మకరందం కంటే మధురమైనవి. ఆమె
స్వభావ మధుర, మధుమతి, మనస్విని, కనుకనే ఆమె సర్వజనారాధ్య అయింది.
 
'ఆ తల్లిని ఆరాధించటంవల్ల మధురమైన సద్భావనా పథం ఏర్పడుతుంది. మధుర
కవితాశక్తి అలవడుతుంది.
సారసూనతతి భాసా
 
ఆమె మహాపద్మాటవీ సంస్థ. బ్రహ్మాండోపరి భాగంలో మూడు లక్షల యోజనాల
విస్తీర్ణంలో తాళదళ ప్రమాణంగల కేసరాలతో ప్రకాశించే గొప్ప పద్మవనంలో ఆమె నివాసం. ఆ
పద్మ వనంలోని పూల కాంతులు ఆమె మీద ప్రసరిస్తాయి. దానితో ఆమె సుమనోజ్ఞంగా
విరాజిల్లుతుంది.
 
కరుణా
 
దయను వర్షించే చల్లని తల్లి. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు లోకానికి క్షేమంకరమైనవి.
దేవీకవచం ఇత్యేతా మాతరః సర్వాః ప్రోక్తా కారుణ్య విగ్రహాః అంటూ నవదుర్గలందరూ -
దేవతలంతా- కారుణ్యమూర్తులేనని పేర్కొన్నది. అరాళా కేశేషు అనే శ్లోకంలో ఆమె కరుణా
విశేషాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరులు భావించారు. భగవతి శరీరం శంభుని కరుణావతారం.
జగద్రక్షణ కోసం ఆమె అవతరించింది.
 
- నాసామణి ప్రవరభాసా
 
అమ్మవారి శ్రేష్ఠమైన ముక్కరలోని మణి కాంతులు మిక్కిలి ప్రకాశవంతమైనవి. ఆ
ముక్కర నక్షత్ర కాంతులను సైతం నవ్వులపాలు చేస్తుంది. దాని కిరణాలు కల్యాణ కాంతులు.
'స్వచ్ఛమైన ముత్యంతో అలంకరించిన ముచ్చటైన ఆమె నాసికను తన ఇష్టసిద్ధి కోసం ఆది
శంకరుడు అర్ధించాడు. ప్రతిఫలంగా కవిలోకంలో నాసా రూపంగా (శ్రేష్ఠుడుగా) భాసించాడు
 
శివా
 
శివం మంగళ మస్యాః అస్తితి శివా- శుభం గలది. శివస్య పత్నీతి శివా శివు
శివా శక్తిః సమాఖ్యాతా, తత్ప్రదత్వాచ్ఛివా స్మృతా।
 
శివకే శక్తి అని పేరు. ఆమె శక్తినిస్తుంది. అమంగళాన్ని తొలగిస్తు
శివ. శివా శివులకు అభేదం కనుక ఆమెకు శివా అని పేరు. సకల స