This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసా విధూతమధు మాసారవింద మధురా ।
కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా
నాసామణి ప్రవర భాసా శివా తిమిర మాసాదయే దుపరతిమ్ ॥ 6
ప్రతిపదార్థం
 
18
 
దాసాయమాన = దాసీజనులుగా అయిన, సుమహాసా = పూల నగవులు కలదీ, కదంబ
వనవాసా = కడిమి తోపులో నివసించేదీ, కుసుంభ సుమనో వాసా = కుంకుమ పూల వంటి
వస్త్రాన్ని ధరించేదీ, విపంచికృత = వీణమీద మీటిన, రాసా = రసరంజిత మైన నిర్వాణం
గలదీ, విధూత = తిరస్కరించిన, మధుమాస = వసంత ఋతువులోని, అరవింద = పద్మాల
:
యొక్క, మధురా = మనోహరత్వంగలది, కాసార = సరోవరంలోని, సూనతతి = పూల మొత్తాల,
భాసా = కాంతిచేత, అభిరామ తనుః = సొగసైన శరీరం గలది, ఆసార = జడివాన వంటి, శీత
:
కరుణా = చల్లని దయగలదీ, శివా = సౌభాగ్యవతి అయిన పార్వతీదేవి, నాసామణి ప్రవర =
(తన) ముక్కర లోని శ్రేష్ఠమైన మణియొక్క, భాసా = కాంతి చేత, తిమిరం = (నా అజ్ఞానమనే)
అంధకారాన్ని, ఉపరతం = తొలగునట్లు, ఆసాదయేత్ = చేయునుగాక !
 
భావం
 
జగజ్జనని సురుచిర దరహాసం కుసుమాలకంటె సుకుమారం. అతి మనోహరం.
నీపవనంలోనే ఆమె నిత్యవిహారం. కుసుంబా పుష్పాలలోనే ఆమె నిత్యనివాసం. పూల కాంతుల
ప్రసారంతో ఆమె శరీరం సులలితంగా ప్రకాశిస్తుంది. వీణా వాదనం ఆమెకు నిత్యామోద విషయం.
ఆమె బహిరంతర సౌందర్యం మకరందం కంటె మధురతరం. దయాగుణానికి నిలయం ఆమె
హృదయం. ముక్కరలోని మణికాంతులతో మెరిసే ఆమె సౌందర్యం అగణ్యం. అటువంటి
శివ నా అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించును గాక !
 
విశేష పద వ్యాఖ్య
దాసాయమాన సుమహాసా
 
ఆ దేవి నిత్య దరహాసముఖారవింద. చారుహాస. ఆమె దరహాసం పూల కంటే
ప్రశాంతంగా మనోజ్ఞంగా వుంటుంది.
 
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆ పరాశక్తి ఆనంద స్వరూపిణి. సుందర మందహాస
సంశోభిత. శ్రీ దేవీ దరహాసం మోహినీ దేవతా స్వరూపం. ఆమె మందస్మిత ప్రభాపూర
మజ్జత్కామేశ మానస. ఆమె చేసే మందహాస లహరిలో పరమేశ్వరుడి మనస్సు పారవశ్యంతో
మునకలు వేస్తుంది.