We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
ఎందుకంటే దయతో నీ విచ్చిన స్తన్యాన్ని త్రావి ద్రవిడ శిశువు మహా కవీశ్వరు డైనాడు- ఇట
ఆదిశంకరుడు తన విషయాన్నే భంగ్యంతరంగా చెప్పుకున్నాడు.
 
విశేషాలు
 
17
 
అంబా తనూ వర్ణనంలోని ఉపమానాలైన కంబు శంబ శశిబింబ శబ్దాల వల్ల వాటి
వర్ణం లాగా స్వచ్ఛమైన జ్ఞానాన్ని కీర్తినీ కోరుకున్నాడు కవి. బింబాధర శబ్దం వల్ల కవితలో
మాధుర్య గుణాన్నీ కాంతా సమ్మితత్త్వాన్నీ కాంక్షించాడు. కురంగ మద జంబాల శబ్ద ప్రయోగంతో
కవితలో కాంతి పరీమళం అవసరమని సూచించాడు. కవితా ప్రయోజనాలు ఇహపర సుఖాలేనని
ఇహ శం శబ్దాల ప్రయోగ స్వారస్యం.
 
సామాన్య శిశువు ఒక్క ముఖంతో పాలు త్రావితేనే తల్లి హృదయం పరవశిస్తుందిగదా!
మరి కుమారస్వామి తన ఆరు ముఖాలతోనూ ఒక్కసారే ఆ జగన్మాతవద్ద పయః పానం చేస్తుంటే,
ఆమె మాతృ హృదయానందం షడ్గుణం కాకుంటుందా! అని బాహులేయ పదప్రయోగ స్వారస్యం.
ఆ ఆనందంతోనే తనను కూడా షణ్ముఖ తుల్యుడిగా భావించి, తనకు మధుర కవితా స్తన్యాన్ని
ప్రసాదించమని కవికాళిదాసు అభ్యర్ధన.
 
ఇలా ఈ శ్లోకంలో అంతటా అంబా మాతృహృదయ సౌందర్యం ప్రధానంగా స్ఫురిస్తుంది.