We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

దేవీఅశ్వధాటి
 
వాక్యాలలోని వర్ణ విభాగం మాత్రం అంత కంటె సుస్పష్టంగా ఉంటుంది. ఆదిశంకరులు దేవీ
కంఠాన్ని స్వర విశేషాలను వివరించారు.
 
శ్లో॥ గలే రేఖా స్త్రిస్రో గతిగమక గీతైక నిపుణే
 
16
 
- సౌందర్యలహరి
 
వివాహ వ్యాసద్ధ ప్రగుణ సంఖ్యా ప్రతిభువః ।
విరాజస్తే నానావిధ మధుర రాగాకర భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే ॥
ఆమె గతిగమక గీతైక నిపుణ. ఆమె గళరేఖలు మూడూ వివాహ సమయంలో శివుడు తనకు
కట్టిన మంగళ సూత్రానికి దగ్గరగా ఉండి పలు పేటలు కలిపి వేసిన మూడు సూత్రాలకు
జ్ఞాపికలుగా ఉన్నాయి. అంతేకాక అవి సంగీతంలోని షడ్జ, గాంధార, మధ్యమ గ్రామ త్రయానికి
సరిహద్దులు లాగా ఉన్నాయి.
 
వినత శంబాయుధాది నికురుంబా
 
ఇంద్రుడు శంబాయుధుడు. రాక్షస సంహారం చేసి దేవతలకు శుభాన్ని కలిగించే శూరుడు.
ఆమె వీరారాధ్య. వీరులందరికీ ఆమె ఆరాధ్యదేవత. వారందరూ ఆమెకు నిత్యం నమస్కరిస్తారు.
 
అంబా
 
పార్వతి త్రిజగన్మాత. సత్త్వ రజస్తమోగుణ స్వరూప, ఆ మూడు గుణాలకూ కారణభూత.
ఆమె పృథ్వీ స్వరూపం. రుద్రాణీ స్వరూపం. ఆమె ఇచ్ఛా జ్ఞాన క్రియల సమష్టి రూపం. వాటి
త్రిపుటి. ఆమె మూలప్రకృతి. ఇలాగా ఈ అంబా శబ్దం సంపూర్ణ మాతృత్వ సౌందర్యాన్ని ప్రతి
బింబిస్తుంది.
 
కురంగమద జంబాల రోచి రహ లంబాలకా (పాఠాంతరం)
 
రహ = వెలువరిస్తున్న పార్వతీదేవి నెఱి వెండ్రుకలు కస్తూరి రంగునూ సువాసననూ
వెలువరిస్తూ శోభిస్తూ భక్తుల అజ్ఞానాన్ని నశింప చేస్తాయి.
బాహులేయ శశి బింబాభిరామ ముఖ
 
బాహులేయుడు - కుమార స్వామి శశి బింబాలవంటి తన ఆరు ముఖాలతో అంబికా
స్తన్య పానం చేసినప్పుడు ఆమె లోని మాతృత్వం ఉప్పొంగింది. ఆనందించింది.
సంబాధిత స్తనభరా
 
కుమారస్వామి స్తన్యపానం కావించినప్పుడు ఆమెస్తనాలు మధుర బాధను పొందాయి.
ఆదిశంకరుడు పార్వతీ స్తన్య పాన మాహాత్మ్యాన్ని ప్రస్తుతించాడు.
 
శ్లో॥
 
తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వత మివ ।
దయావత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య తవయత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా ॥
 
- సౌందర్యలహరి
 
తల్లీ! పార్వతీ! నీ పాలిండ్ల నుండి వెలువడుతున్న క్షీరధార నిజంగా సారస్వత ప్రవాహమే.