This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
శో॥
 
3
 
15
 
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే ।
అంబా కురంగ మద జంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధిత స్తనభరా ॥ 5
ప్రతిపదార్థం
 
గళేన = కంఠం యొక్క ఆకారంచేత, కంబౌ = శంఖంతో, అతీవ = మిక్కిలి,
సవిడంబా = పోలికగలదీ, నవతుంబ = లేత సొరకాయను, ఆభ = పోలిన, వీణ = వీణతో,
సవిధా = కూడి వున్నది, బింబాధరా - దొండ పండు వంటి క్రీ పెదవి గలదీ, కదంబ
విపినే = కడిమి తోటలో, వినత = వినమ్రులై నమస్కరిస్తున్న, శంబాయుధ + ఆది = వజ్రం
ఆయుధంగాగల ఇంద్రుడు మొదలైన దేవతల యొక్క, నికురుంబా= సమూహంగలదీ,
కురంగమ కస్తూరి, జంబాల = పంకం యొక్క, రోచిస్ = కాంతిగల, లంబాలకా =
వ్రేలాడుచున్న కురులు గలదీ, బాహులేయ = కుమార స్వామి యొక్క, శశి బింబాభిరామ =
చంద్రబింబం లాగా మనోహరమైన, ముఖ = ముఖంతో, సంబాధిత స్తనభరా = పీడింపబడిన
కుచభారం కలదీ అయిన, అంబా = మాతృమూర్తి పార్వతీ దేవి, మే = నాకు, శం = శుభాన్ని,
సుఖాన్నీ, శాస్త్ర సంపదనూ, ఇహ = ఈ జన్మలో, దిశతు = ప్రసాదించును గాక!
భావం
 
శ్రీదేవి కంఠం శంఖంవలె మనోహరం. లేత సొరకాయ లాంటి చక్కని వీణను ఆమె
వహిస్తుంది. ఆమె క్రీ పెదవి అచ్చంగా దొండ పండే. నల్లని ముంగురులు ముఖానికి చక్కని
శోభ. చంద్రుడిలా మనోహరమైన ముఖ సీమగల బాలుడైన కుమారస్వామి తన ఆరు ముఖాలతో
స్తన్యపానం చేస్తుండటం వల్ల ఆమె స్తనసీమ బాగా గాసి పొంది ఉంటుంది. కదంబ వనంలో
ఉన్న ఆ దేవిని ఇంద్రాది దేవతలు భక్తి ప్రపత్తులతో ప్రార్ధిస్తుంటారు. అటువంటి అంబ నాకు
శుభాన్ని సమకూర్చు గాక !
 
విశేష పద వ్యాఖ్య
కంబావతీవ సవిడంబా గళేన
 
స్త్రీకి శంఖాకారం గల కంఠం ఉండటం అందమే కాకుండా శుభాస్పదం కూడ. శంఖాని
లాగా కంఠానికి గూడా మూడు రేఖలున్న స్త్రీ కంబుకంఠి. దేవి కంబుపూగ సమచ్ఛాయా కంథర
ఆమె గళసీమ శంఖాకృతిని మించి సుందరంగా ఉంటుంది.
 
నవ తుంబాభ వీణ సవిధా
 
పార్వతి వీణావాదన ప్రియగా, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపిగా ప్రసిద్ధి
వహించింది. లేత సొరకాయ వంటి కాంతిగల వీణ ఆమె చెంతనే ఉంటుంది. దాని స్వర
మాత్రమే ఆమె స్వర మాధుర్యానికి సామీప్యంలో ఉంటుంది. కానీ ఆమె గళం నుండి వెలువ