This page has not been fully proofread.

దేవీఅశ్వధాటి
 
పతికి నమస్కరించటం ఆర్ష సంప్రదాయం. పార్వతి సదాశివ పతివ్రత, శివారాధ్య, శివధర్మ
పరాయణ కనుక ఆమె నిత్యమూ అతడికి నమస్కరిస్తుంది.
శైలాధి రాజ తనయా
 
హిమవంతుడు కొండలకు రాజు. అతడి కూతురు గిరిజ ఉన్నత వంశ సంజాత. తండ్రికి
 
14
 
తగిన తనయ.
 
విశేషాలు
 
సుందర రూపంతో వత్సల భావంతో పార్వతీదేవి తన హృదయంలో అధివసించి,
కష్టాలను పోగొట్టి ప్రశాంత చిత్రాన్ని సుమధుర వాక్కునూ సంప్రదాయ గౌరవాన్ని ఔన్నత్యాన్నీ
చైతన్యాన్నీ సౌఖ్యాన్నీ ప్రసాదించాలి.
 
ఈ శ్లోకంలో ముఖం చంద్రోపమం, వస్త్రమూ తేజమూ రెండూ సూర్యోపమాలే!
(అరుణః = సూర్యుడు) పార్వతీ దేవి చంద్ర సూర్యాగ్ని కళాత్మిక. కనుకనే అరుణోపనిషత్తు
అసంఖ్యాకమైన కళలకు ఉత్పత్తి స్థానంగా ఆమెను కీర్తిస్తున్నది.
 
"మరీచయ స్వాయంభువా యే శరీరాణ్యకల్పయత్ । మా చ తేఖ్యాస్మతీ రిషత్ ।
లోకస్య ద్వార మర్చిమ త్సవిత్రమ్ । జ్యోతిష్మద్రాజమానం మహస్వత్, అమృతస్య ధారా
బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు"
 

 
ఇందులోని అర్చిష్మత్ అనేవి అగ్ని కళలు, జ్యోతిష్మత్ అనేవి చంద్రకళలు, మహస్వత్
అనేవి సూర్యకళలు. అవి ఆమె పాదాల నుండి ఉద్భవిస్తాయి.
 
ఈ శ్లోకంలో అగ్నికళల ప్రస్తావన లేదు. కాని, 'కూలాతిగామి' అనే శ్లోకంలో జ్వలన
కీలా శబ్దంతో అగ్నికళ ప్రసక్తమైంది. ఈ విధంగా కాళిదాసు శైలాధిరాజ తనయను సర్వ కళాత్మికగా
భావించి స్తుతించాడు.