This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
13
 
నితంబ ఫలకా
 
స్త్రీల శృంగార సంబంధమైన షోడశ కళా స్థానాలలో పిరుదు ఒకటి. దేవి బృహన్నితంబ
విలసజ్జఘన. దేవీ నితంబ జఘనాలు పృథ్వీ తేజస్సువలన ఉద్భవించినట్లు దేవీ మాహాత్మ్యం,
వామన పురాణం వంటి గ్రంథాలు వివరించాయి. పృథ్వి అనేక వస్తువులు స్వరూపం. దాని
తేజస్సు సుచిత్రంగా ఉంటుంది. అందువల్లనే ఆమె జఘన నితంబాలు కూడ సుచిత్రంగా
ఉంటాయి. బరువైన ఆమె నితంబభాగం స్థిరత్వానికి సూచన. అది ఆమె స్థిరమైన, గొప్పదైన
కరుణను తెలుపుతుంది.
 
కోలాహలక్షపిత ............శోషణ రవిః
 
రవిః = ఎక్కడా నిలువకుండా పోతుండే వాడు, ఇతరుల చేత స్తుతింపబడేవాడు,
రక్షించేవాడు. దేవతలు సుఖలాలసులు భోగులు భక్తి పరాయణులు. వారిని హింసించటమే
రాక్షసులకు ధ్యేయం. కనుక ఆ దేవి ఎప్పుడూ దేవకార్య సముద్యతగా రాక్షసఘ్నిగా రక్షాకరిగా
కన్పిస్తుంది. వివిధావతారాలనెత్తి శుంభ నిశుంభులనూ భండాసుర మహిషాసురాది రాక్షసులనూ
పాశుపత సదాశివాది అస్త్రాలతో అంత మొందించింది. ఇలా తన భక్తులైన దేవతల యొక్క
కష్టాల కడలిని ఎండగట్టి వారికి నిరతిశయ సుఖాన్ని ప్రసాదిస్తుంది.
 
శరణం త్వాం ప్రపద్యంతే, యే దేవి పరమేశ్వరి ।
 
న త్వేషా మాపదః కాశ్చి, జ్ఞయన్తో కోపి సంకటః ॥
ఆ దేవిని ఎవరైతే శరణు కోరుతారో వారికి ఆమె ఏ కష్టాలనూ రానీయదు.
స్థూలా కుచే
 
వరాహపురాణం
 
కుచొ = కుచ్యతే కామినా నఖైః కుచౌ - నాయకుడి నఖాల చేత గిల్లబడేది. స్త్రీలు
సౌందర్యానికి ప్రతిరూపాలు. వారి స్తనాలు కళాస్థానాలు. సౌందర్య పయః కలశాలు. ఇక దేవీ
కుచ స్వరూప గుణ విశేషాలన్నీ ఆమె మూర్తి రహస్యాలు. అవి ఆనంద సముద్రాలు. భక్తుల
కోర్కెలు తీరుస్తాయి. దేవి తన స్తన్యాన్ని తన సంతాన మైన ముల్లోక వాసుల చేత త్రావించి
వారికి ప్రాణశక్తినీ పోషణశక్తినీ ప్రసాదిస్తుంది. ఎంతమంది బిడ్డలు ఆ తల్లి పాలు తాగినా ఆమె
స్తన సౌందర్యం సడలదు. అందుకు కారణం ఆమె నిత్యయౌవన, జగన్మాత, జగతోషిణి.
అయిన సాక్షాత్ అన్నపూర్ణాదేవి.
జలద నీలాకచే
 
నల్లని తెగబారెడు కురులు సుమంగళీ లక్షణం. అవి సౌందర్య పోషకాలు. ఆ నీల
కాచాలను సింగారించటం ఒక కళ. దేవీ కేశ పాశాన్ని కవి కాళిదాసు జలద నీలంగా భావించాడు.
జలద నీల కచాలను చూచిన నాయక మయూరం పరవశిస్తుంది. ఆమె నల్లని వెండ్రుకలు
భక్తుల అజ్ఞా నాంధకారాన్ని పారద్రోలు తాయని ఆదిశంకరోక్తి.
 
శూలాయుధ ప్రణతి శీలా
 
శూలాయుధుడు శివుడు దుష్ట శిక్షణ వ్యగ్రుడు. పార్వతి కులాంగన కులాంగనలు